IPL 2024: పాపం గిల్..మ్యాచ్ ఓడిపోయారు..ఫైనూ పడింది అసలే ఓడిపోయి బాధగా ఉన్న శుభ్‌మన్ గిల్‌కు నెత్పతి మీద మరో పిడుగు పడింది. నిన్నటి మ్యాచ్ లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు గుజరాత్ కెప్టెన్ గిల్‌కు 12 లక్షల జరిమానా విధించారు. By Manogna alamuru 27 Mar 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Subhman Gill: ఐసీఎల్ 2024 ప్రారంభం అయ్యాక మొదటి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన గుజరాత్ టెటాన్స్ రెండో మ్యాచ్ లో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది. చనిన్న చెపాక్ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో ఘోరపరాజయం పాలైంది. దానికి తోడు ఈ జట్టు కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ మీద మరో పిడుగు పడింది. అసలే ఓటమి భారంతో కుంగిపోయిన గిల్‌కు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ 12 లక్షల జరిమానా విధించింది. దీనికి స్లో ఓవర్ రేట్. గుజరాత్ టెటన్స్ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం దీనికి ఫైన్ పడుతుంది. అయితే గిల్‌కు ఇది మొదటి తప్పు కాబట్టి తక్కువ మొత్తమే ఫఐన్‌గా వేశామని చెబుతున్నారు నిర్వాహకులు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్.. నిన్న చెన్నై చెపాక్ స్టేడియంలో సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడింది. ఇందులో మొదట గుజరాత్ బౌలింగ్ చేసింది. 63 పరుగుల తేడాతో సీఎస్‌కే గెలుపొందింది. తరువాత 207 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులను మాత్రమే చేయగలిగింది. సీఎస్‌కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మన్, తుషార్ దేశ్‌పాండే, దీపక్ చాహర్ తలా రెండు వికెట్లు సాధించగా.. పతిరానా ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక సూపర్ కింగ్స్ టీమ్‌లో బ్యాటర్లు రెచ్చిపోయారు. రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1సిక్స్‌లు), శివమ్ దూబే(23 బంతుల్లో 51, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగారు. కళ్ళు చెదిరే షాట్లు కొడుతూ ఆద్యంతం అలరించారు. Also Read:LIC: మన ఎల్‌ఐసీకి తిరుగులేదు..ప్రపంచంలోనే నంబర్ వన్ #cricket #match #ipl-2024 #gujarath-titans #subhman-gill మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి