Bangladesh: బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ పొడిగింపు..కనిపిస్తే కాల్చివేత

బంగ్లాదేశ్‌లో ఇంకా అల్లర్లు ఆగడం లేదు. హింసతో దేశం అట్టుడికిపోతోంది. విద్యార్ధుల ఆందోళనలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. వీటిని ఆపేందుకు అక్కడ ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ ఆర్డర్‌ను పాస్ చేసింది. ఈరోజు సాయంత్రం వరకు కర్ఫ్యూను పొడిగించింది.

New Update
Bangladesh: రిజర్వేషన్ల కోటాను తగ్గించండి-బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు

Shoot at site orders: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలంటూ నిరసనలు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని విద్యార్ధులు. ఇది కాస్తా మితిమీరి హింస వరకు వెళ్ళింది. దీని కారణంగా ఇప్పటివరకు 114 మరణించారు. మరో 2500 మందికి పైగా గాయపడ్డారు. దాంతో బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ విధించారు. విద్యార్ధుల అల్లర్లు ఇంకా ఆగకపోవడంతో దానిని ఈరోజు సాయంత్రం వరకు పొడిగించారు. హింసాకాండ కారణంగా దేశంలోని పలు నగరాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను కూడా నిషేధించారు. మరోవైపు బంగ్లాదేశ్‌ నుంచి వలసలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ దేశాలకు వెళ్తున్నారు.

బంగ్లాలో సివిల్ సర్వీస్ పోస్టుల్లో మూడింట ఒక వంతు వారి వారసులకు రిజర్వ్ చేస్తూ స్వాతంత్ర్య సమరయోధుల కోటాను హైకోర్టు పునరుద్ధరించిన నేపథ్యంలో జూలై 1న ఆందోళన హింసాత్మక ఘర్షణలకు దారితీసింది.ఢాకా, చటోగ్రామ్, రంగ్‌పూర్, కుమిల్లాతో సహా బంగ్లాదేశ్‌లోని నగరాల్లో వేలాది మంది విద్యార్థులు కర్రలు, రాళ్లతో సాయుధ పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. విద్యార్థుల నిరసన, రాళ్లదాడి కారణంగా ఢాకాతోపాటు దేశంలోని ఇతర పెద్ద నగరాల్లో అంతరాయం ఏర్పడింది. ఇది ప్రజలకు కష్టాలకు దారితీసింది. ఎనిమిది జిల్లాల్లో విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. రోడ్లు, రైలు మార్గాలను అడ్డుకున్నారు.

ఈ నిరసనలు మరీ ఎక్కువ అవడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన విదేశీ పర్యటనను కూడా కాన్సిల్ చేసుకున్నారు. ఆమె ఆదివారం స్పెయిన్, బ్రెజిల్‌లను సందర్శించాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు