Ayodhya: అయోధ్యలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. కారణం అదేనా !

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గత వారం రోజులుగా భక్తుల రద్దీ తగ్గిపోయింది. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వచ్చి బాల రాముడిని దర్శించుకునేవారు. ఎన్నికల తర్వాత భక్తుల రద్దీ తగ్గిపోవడంతో తమకు ఆదాయం రావడం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు.

New Update
Ayodhya: అయోధ్యలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. కారణం అదేనా !

Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గతకొన్నిరోజులుగా భక్తుల రద్దీ తగ్గిపోయింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ ఏడాది జనవరిలో రామమందిర ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి బాల రాముడిని దర్శించుకుంటున్నారు. భక్తుల తాకిడితో అక్కడ స్థానిక ఉండే చిరు వ్యాపారులకు, రిక్షా డ్రైవర్లకు ఉపాధి దొరికేది. అయితే గత వారం రోజుల నుంచి అయోధ్యలో భక్తుల రద్దీ తగ్గిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.

Also Read: మరోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్‌ దోవల్

ఇటీవల రామమందిరం, హనుమాన్‌గర్హి పరిసరాల్లో భక్తులతో సందడి వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని స్థానికులు వాపోతున్నారు. తమకు పని దోరకకా, వ్యాపారాలు నడవక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఎలక్ట్రిక్ రిక్షా నడపడం వల్ల ఒక్క రోజులోనే రూ.500 నుంచి రూ.800 వరకు వచ్చేవని.. కానీ ఇప్పుడు మాత్రం కనీసం రూ.200 నుంచి రూ.250 రావడమే కష్టమే ఉందని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. అయితే ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓడిపోవడం కూడా అయోధ్యలో భక్తుల రద్దీ తగ్గేందుకు ఓ కారణమని పలువురు నిపుణులు చెబుతున్నారు.

Also Read: యెడియూరప్పకు బిగ్ షాక్‌.. నాన్‌ బెయిలబుల్ వారెంట్‌ జారీ చేసిన కోర్టు

#telugu-news #national-news #ayodhya #ram-mandir
Advertisment
తాజా కథనాలు