Yediyurappa: యడియూరప్పకు బిగ్ షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై నమోదైన పోక్సో కేసుపై విచారించిన బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ క్రమంలోనే యెడియూరప్ప ఏ సమయంలోనైనా అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. By B Aravind 13 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Arrest Warrant Against Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం యెడియూరప్పకు బిగ్ షాక్ తగిలింది. లైంగిక ఆరోపణలతో ఆయనపై పోక్సో కేసు (POCSO Case) నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఇదిలాఉండగా.. బుధవారం సీఐడీ (CID) ఆయనకు తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు పంపించింది. దీనికి ఆయన స్పందించలేదు. దీంతో యెడియూరప్పను అరెస్టు చేసేందుకు సీఐడీ స్పెషల్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా బెంగళూరు కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ క్రమంలోనే యెడియూరప్ప అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. Also Read: మరోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ #yediyurappa #pocso #karnataka #pocso-act మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి