YCP Shock : ఏపీ(AP) లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ(YCP) కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా(East Godavari) అనపర్తి(Anaparthy) లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) కి చెందిన 1000 మంది కార్యకర్తలు టీడీపీ(TDP) తీర్థం పుచ్చుకున్నారు. 2014 నుండి 2019 వరకు వైసీపీ నాయకుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విజయానికి కృషిచేసిన ఆది యూత్ సభ్యులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. సుమారు 1000 బైకులతో అనపర్తి దుప్పలపూడి గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరం లోని ఎస్ఎన్ఆర్ కళ్యాణమండపంలో జరిగిన సభలో ఆది యుత్ నాయకుడు మల్లిడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 1000 మంది కార్యకర్తలు టీడీపీ గూటికి చేరారు.
Also Read : ఇవాళ్టి నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ.. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇవే!
సభలో మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వీరికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. అనపర్తి సావరం నుండి మొదలైన బైక్ ర్యాలీ పురవీధుల గుండా దుప్పలపూడి చేరుకోవడంతో అక్కడ వైసీపీ నాయకుడు నల్లమిల్లి వెంకటరెడ్డి సుమారు 150 మంది కార్యకర్తలతో టీడీపీలో చేరారు. అక్కడి నుండి బైక్ ర్యాలీలో పాల్గొని ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపానికి చేరుకున్నారు.
Also Read : పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలకు పురందేశ్వరి క్లారిటీ!
ఈ సందర్భంగా వైసీపీని వీడుతున్న ఆది యూత్ సభ్యులు వైసీపీ జెండాలను డస్ట్ బిన్ లో వేసి తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. యూత్ సభ్యులు చేరికతో గ్రామంలో రహదారులన్నీ పసుపు మయంగా మారాయి. ఎన్నికల తరువాత జరుపుకునే విజయోత్సవ ర్యాలీ చేసినట్లు కనిపిస్తోంది. ఈ ర్యాలీతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని టీడీపీ శ్రేణులు అంటున్నారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎండగడుతూ ప్రసంగాలు చేశారు. అదే విధంగా ఎస్సీ, బీసీ మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలే కాకుండా వీరి వల్ల అసువులు బాసిన అనేకమందికి సభలో నివాళులర్పించారు.