TKR: కేసీఆర్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత?

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడీ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. గత శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన తీగల.. టికెట్ రాకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

New Update
TKR: కేసీఆర్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత?

Teegala Krishna Reddy: పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) దగ్గర పడుతున్న వేళ మాజీ సీఎం కేసీఆర్ కు (KCR) షాక్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ (BRS Leader) నేత సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నేత తీగల కృష్ణారెడ్డి వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్‌ను సచివాలయంలో తీగల కృష్ణారెడ్డి కలవడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది.

గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు తీగల కృష్ణారెడ్డి. గత శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన తీగల.. టికెట్ రాకపోవడంతో పార్టీపై అలిగినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా బీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో తీగల కృష్ణారెడ్డి ఉన్నారు. గత ఎన్నికల సమయంలోనే తీగల కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం జరిగింది.తాజాగా సీఎం రేవంత్‌ను కలవడంతో తీగల కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: రేపు సా.4గంటలకు బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం

అదే బాటలో మోత్కుపల్లి..

సీఎం రేవంత్ (CM Revanth) రెడ్డి జన రంజక అద్భుతమైన పాలన అందిస్తున్నారని మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఈ మేరకు శనివారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియా పాయింట్ లో విలేకరులతో మాట్లాడుతూ నెల రోజుల పాలన చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఒరవడితో ముందుకు సాగుతుందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉన్నదని భావనను కల్పిస్తుంది అన్నారు. భవిష్యత్తులోనే ఇదే వర్ని కొనసాగించాలని మేధావులు, ప్రజా సంఘాల నేతలతో సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ తో భేటీ కావడంతో మోత్కుపల్లి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది .

ALSO READ: తులం బంగారం, రూ.లక్ష.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

WATCH OUR EXCLUSIVE STORY ON THIS:

Advertisment
తాజా కథనాలు