IND vs AUS: చివరి మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్

వన్డే వరల్డ్ కప్‌ ముందు భారత్‌-ఆస్ట్రేలియా జట్లు వన్డే సీరిస్‌ ఆడుతున్నాయి. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. రేపు నామమాత్రపు మ్యాచ్‌ జరుగనుంది. కానీ మెగా టోర్నీకి ముందు జరుగుతున్న చివరి మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది.

New Update
IND vs AUS: చివరి మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్

వన్డే వరల్డ్ కప్‌ ముందు భారత్‌-ఆస్ట్రేలియా జట్లు వన్డే సీరిస్‌ ఆడుతున్నాయి. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. రేపు నామమాత్రపు మ్యాచ్‌ జరుగనుంది. కానీ మెగా టోర్నీకి ముందు జరుగుతున్న చివరి మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్‌కు అక్షర్ పటేల్ దూరమయ్యాడు. గాయం కారణంగా అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా వన్డే వరల్డ్ కప్ కోసం జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొననుంది.

దీంతో అక్షర్ పటేల్ వరల్డ్ కప్‌ అశలు ఆవిరి అయినట్లే అనుకోవాల్సి ఉంటుంది. కాగా వరల్డ్ కప్‌లో పాల్గొనే టీమ్‌లో ఈ నెల 28లోపు మార్పులు చేసే అవకాశం ఉంది. కానీ అప్పటిలోగా అక్షర్ పటే కోలుకుంటాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఒకవేళ అక్షర్ పటేల్‌ అప్పటిలోగా కోలుకోకపోతే అతడి స్థానాన్ని సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ భర్తీ చేసే అవకాశం ఉంది. అశ్విన్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉండటం కూడా అతడికి కలిసి వచ్చే అంశం. ఆసిస్‌తో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌లో అశ్విన్ నాలుగు వికెట్ల పడగొట్టాడు. అంతే కాకుండా ఆసియా కప్‌ టోర్నీటో జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మరోవైపు రెండో వన్డేలో చెలరేగిపోయిన భారత బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌, ఆల్ రౌండర్ శార్థూల్ ఠాకూర్‌లకు మెనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా మొదటి రెండు మ్యాచ్‌లు ఆడని బుమ్రా రేపు జరిగే చివరి మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. దీంతోపాటు రేపు జరుగబోయే మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌ మిషన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య టీమ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. వీరి రాకతో టీమిండియా మరింత బలంగా మారనుంది. దీంతో చివరి మ్యాచ్‌లో సైతం గెలిచి టీమిండియా ఈ సిరీస్‌ను క్లీన్ స్విప్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు