Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు బోల్తా..నలుగురి మృతి..ఇంకా!

సిమ్లాలోని జుబ్బల్‌ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుబ్బల్‌ లోని గిల్తాడి రోడ్డు పై హెచ్‌ఆర్‌టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం నలుగురు అక్కడికక్కడే మృతి చెండగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ కూడా ఉన్నారు.

New Update
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు బోల్తా..నలుగురి మృతి..ఇంకా!

Bus Accident: సిమ్లాలోని జుబ్బల్‌ లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుబ్బల్‌ లోని గిల్తాడి రోడ్డు పై హెచ్‌ఆర్‌టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం నలుగురు అక్కడికక్కడే మృతి చెండగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ కూడా ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపించారు.

తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి తెలుసుకున్న జుబ్బల్‌ తహసీల్‌ ఏరియా ఎస్‌డీఎం రాజీవ్‌ నమ్రాన్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్టీసీ బస్సు జుబ్బల్‌ మీదుగా వెళ్తుందని రాజీవ్‌ వివరించారు.

బస్సు ఎలా బోల్తా పడిందో తెలియడం లేదని ఆయన అన్నారు. బస్సు బోల్తా పడడంతో స్థానికులు వెంటనే బస్సు లోపల చిక్కుకున్న వారిని రక్షించి బయటకు తీసుకుని వచ్చారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు.

Also read: తిరుమలలో ఘోర ప్రమాదం.. కారు టైర్‌ పగిలి..నలుగురి పరిస్థితి విషమం!

Advertisment
తాజా కథనాలు