మిరాకిల్.. కవల పిల్లలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు.. ఉగాండాలోని సఫీనా నముక్వాయ అనే 70 ఏళ్ల వృద్ధురాలు ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చింది. విట్రో ఫలదీకరణ (ఐవీఎఫ్) చికిత్స ద్వారా ఆమెకు ఓ బాబు, పాప పుట్టారు. ప్రస్తుతం సఫీనా ఆరోగ్యంగా ఉన్నారని.. చక్కగా మాట్లాడుతున్నారని వైద్యులు తెలిపారు. By B Aravind 02 Dec 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఈ ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఓ చోట ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే తాజాగా 70 ఏళ్ల వృద్ధురాలుకు ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉగాండాలోని సఫీనా నముక్వాయ అనే వృద్ధురాలు ఈ చిన్నారులకు జన్మనిచ్చింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద వయసుగల నవ మాతృమూర్తిగా ఈమె నిలిచిపోయింది . ఉగాండా రాజధాని కంపాలాలో బుధవారం రోజున ఓ ఆసుపత్రిలో సిజేరియన్ ద్వారా ఈమెకు ఓ బాబు, పాప పుట్టారు. ప్రస్తుతం సఫీనా ఆరోగ్యంగా ఉన్నారని.. చక్కగా మాట్లాడుతున్నారని ఆ ఆసుపత్రి అధికార ప్రతినిధి ఆర్థర్ మ్యాట్సికో శుక్రవారం తెలిపారు. Also read: రాజధానిలో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు..అయినా వెనకాడట్లే..!! ఆమె విట్రో ఫలదీకరణ (ఐవీఎఫ్) చికిత్స ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు. 2020లో కూడా సఫీనా 'విట్రో ఫలదీకరణ' ద్వారా ఓ కూతురుకు జన్మనిచ్చింది. ఇదిలా ఉండగా.. 2019లో దక్షిణ భారతదేశంలో 73 ఏళ్ల మహిళకు ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలు పుట్టినట్లు గతంలో వార్తలు వచ్చాయి. Also read: ముంచుకొస్తున్న మిచౌంగ్..హెచ్చరికలు జారీ చేసిన అధికారులు #telugu-news #woman #uganda మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి