Andhra Pradesh: సీనియర్ ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేది బదిలీ

సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయనను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. గోపాలకృష‌ణను బదిలీ చేయడం ఇది ఇప్పటికి రెండోసారి.

Andhra Pradesh: సీనియర్ ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేది బదిలీ
New Update

Andhra Pradesh Government: సీనియర్ ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేదిని ఆంధ్రప్రభుత్వం రెండోసారి బదిలీ చేసింది. ఇటీవల వ్యవసాయ, గనుల శాఖ నుంచి ఆయన్ను కార్మిక శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే, కార్మికశాఖ బాధ్యతలు అప్పగించడంపై పాలనావర్గాల్లో వ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఆయన్ను మళ్ళీ ఇప్పుడు బదిలీ చేశారని సమాచారం. గ్రామ, వార్డు సచివాలయాలకు పార్టీ రంగులను వేయడంలో గోపాలకృష్ణ చాలా విర్శలు ఎదుర్కొన్నారు. అదికాక మాజీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలకు సహకరించారనే ఆరోపణలఉ కూడా ఈయన మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ద్వివేదిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులుజారీ అయ్యాయి. దీంతో కార్మికశాఖ కార్యదర్శి నాయక్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు జగన్ ప్రభుత్వం నియమించిన రిటైర్ట్ ఐఏఎస్ అధికారులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. లా సెక్రటరీ సత్య ప్రభాకర్ రావు, విజిలెన్స్ కమిషనర్ వీణా ఈష్, పట్టణాభివృద్ది శాఖ అడిషనల్ సెక్రటరీ ఎం. ప్రతాప్ రెడ్డి, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ వీణా ఈష్ సహా వివిధ హోదాల్లో ఉన్న వెంకట రమణా రెడ్డి, సుధాకర్, మల్లిఖార్జున రాజీనామలు చేశారు. వీరి రాజీనామాలను ఆమోదిస్తూ ఏపీ సీఎస్ నీబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read:UPSC: చీటింగ్‌కు చెక్..ఏఐ టెక్నాలజీతో యూపీఎస్సీ

#andhra-pradesh #ias #transfer
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe