Heart Attack: అయ్యో.. జిమ్ చేస్తుండగా గుండెపోటుతో డీఎస్పీ మృతి..

ఈ మధ్య గుండెపోటు మరణాలు పెరగడం కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా హర్యానాలోని పానిపట్ జిల్లా జైల్లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి గుండెపోటుతో మృతి చెందాడు. సోమవారం ఉదయం అలా జిమ్ చేస్తుండగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో ఆ పోలీస్ అధికారిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. డీఎస్పీ మృతితో హర్యానా పోలీసు శాఖలో విషాదం నెలకొంది.

New Update
Heart Attack: అయ్యో.. జిమ్ చేస్తుండగా గుండెపోటుతో డీఎస్పీ మృతి..

ఇటీవలి కాలంలో గుండె పోటు మరణాలు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా యువకుల నుంచి వృద్ధుల ప్రాణాలు పొగొట్టుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ గుండెపోటు మరణాలు మరింత పెరుగుతున్నాయి. పార్క్‌లో నడుస్తూ, జిమ్ చేస్తూ, డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం లాంటి ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఓ పోలీస్ ఉన్నతాధికారి జిమ్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన హర్యానాలోని పానిపట్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జోగిందర్ దేశ్వాల్ అనే వ్యక్తి పానిపట్ జిల్లా జైల్లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం ఉదయం ఆయన జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నారు. అలా జిమ్ చేస్తుండగానే.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో ఆ పోలీస్ అధికారిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. జోగిందర్ మృతితో హర్యానా పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పోలీసు శాఖ, జైలు సిబ్బంది నివాళులు అర్పించారు.

Also Read: ఇద్దరి ఫొటోలు లీక్.. స్పందించిన శశిథరూర్

అయితే గుండెపోటు మరణాలపై వైద్యులు హెచ్చరికలు చేస్తున్నారు. గుండెపోటుకు ముందు చాలామందిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. వాటిని ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే.. ఈ హృద్యోగ మరణాల బారి నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. గుండెపోటుకు ముందు శారీరకంగా.. ప్రతిఒక్కరిలో కొన్ని లక్షణాలు బయటపడి మనల్ని హెచ్చరిస్తాయని.. ఇలా వచ్చిన వెంటనే అప్రమత్తం కావాలని సూచనలు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు