Mumbai : ముంబై యాక్సిడెంట్‌ కేసులో శివసేన నేత కుమారుడు అరెస్ట్

ముంబై వర్లీలో అతి వేగంగా వెళుతున్న బీఎమ్‌డబ్ల్యూ ఓ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించింది. ఈ యాక్సిడెంట్‌ను శివసేన సీనియర్ నేత రాజేష్ షా కుమారుడు చేశాడని తేలింది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.

New Update
Mumbai : ముంబై యాక్సిడెంట్‌ కేసులో శివసేన నేత కుమారుడు అరెస్ట్

Accident : అధికార మత్తు, మద్యం మత్తు రాజకీయ నేతల కళ్ళు మూసుకుపోయేలా చేస్తున్నాయి. తమను ఏం చేసేవారు లేరన్న అహంకారంతో యాక్సిడెంట్‌లు చేస్తున్నారు. ఇంతకు ముందు హైదరాబాద్‌ (Hyderabad) లో బీఆర్ఎస్ నేత షకీల్ కుమారుడి యాక్సిడెంట్ గురించి విన్నాము. ఇప్పుడు ముంబయ్‌ (Mumbai) లో శివసేన (Shiv Sena) నేత కుమారుడు ఇదే పని చేశాడు. శివసేన ఉపనేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా ఈ యాక్సిడెంట్‌ను చేశాడు. మద్యం మత్తులో ఉన్న ఇతను ర్యాష్‌గా కారు నడపమే కాకుండా.. ఓ మహిళ చావుకు కారణమ్యాడు. అయితే ఇతను ఈ ఘటన తరవాత పరారీలో ఉన్నాడు.

ప్రస్తుతం మిహిర్ షా బ్లడ్ శాంపిల్స్‌ను పోలీసులు టెస్ట్‌కు పంపించారు. దాంతో పాటూ రాజేష్ షాను అతని డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుమారుడు యాక్సిడెంట్ కేసులో సహకరించనందుకు వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సాక్ష్యాలను నాశనం చేయడం లాంటి ఆరోపణల కింద వారి మీద కేసులను నమోదు చేశారు.

యాక్సిడెంట్ అయిన బీఎమ్‌డబ్ల్యూ కారు (BMW Car) మిహిర్ పేరు మీదనే ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిహిర్ షా జుహూలోని బార్‌లో మద్యం తాగాడు. ఆ తర్వాత అతను డ్రైవర్‌ను లాంగ్‌ డ్రైవ్‌కు తీసుకెళ్ళమని అడిగాడు. కారు వర్లీకి వచ్చింది. అక్కడ మిహిర్ తాను డ్రైవ్ చేస్తానని పట్టుబట్టాడు. డ్రైవర్ ఎంత వద్దని చెబుతున్నా వినలేదు. డ్రైవింగ్ మొదలుపెట్టిన కాసేపటికే కారుతో స్కూటర్‌ను ఢీకొట్టాడు. ఇందులో కోలివాడకు చెందిన కావేరి నక్వా, భర్త ప్రదీక్ నక్వా స్కూటర్ మీద ఉన్నారు. కారు గుద్దడంతో ఇద్దరూ ఎగిరి వెళ్ళి దూరంగా పడ్డారు. తరువాత ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ కావేరి చనిపోగా..ప్రదీక్ కోలుకుంటున్నారు.

Also Read:Telangana: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల

Advertisment
తాజా కథనాలు