Movies : శివరాత్రి ట్రీట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల..ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల

భలే ఇంట్రస్టింగ్ ప్రాజెక్టుతో వచ్చేస్తున్నాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. నాగార్జున, ధనుష్ కాంబినేషన్‌లో సినిమాను అనౌన్స్ చేసి తెలుగు ప్రేక్షకుల అంచనాలను పెంచేశాడు. ఈసారి గ్యాంగ్‌స్టర్ మూవీతో ముందుకు వస్తున్నాడు. శివరాత్రి సందర్భంగా ధనుష్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు శేఖర్ కమ్ముల.

Movies : శివరాత్రి ట్రీట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల..ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల
New Update

Sekhar Kammula New Film : ఫ్యామిలీ, యూత్ డ్రామా... ఇదీ ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఫార్ములా. కానీ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేశాడు. మొదటిసారి గ్యాంగ్‌స్టర్‌ మూవీ(Gangster Movie) తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. అది కూడా ఇద్దరు బిగ్ స్టార్లతో. తమిళ స్టార్ ధనుష్(Dhanush), మన్మధుడు నాగార్జున(Nagarjuna) కలిసి చేస్తున్న ఈ సినిమాకు కుబేర(Kubera) అని పేరు పెట్టారు. ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ధ‌నుష్ పాత్ర ఎలా ఉండ‌బోతుంది? నాగార్జున రోల్ ఎలా ఉంటుంది? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా శివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని అంద‌రి అంచ‌నాలు మ‌రింత పెంచుతూ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్..టైటిల్ రిలీజ్ చేసింది కుబేర టీమ్.

బిచ్చగాడిలా ధనుష్..

మొదటటిసారిగా కుబేర సినిమాలో ధనుష్ లుక్‌ను రిలీజ్ చేశారు. చిరిగిన బ‌ట్ట‌లు.. మాసిన గ‌డ్డం‌తో ధ‌నుష్ కనిపిస్తున్నాడు. చూస్తుంటే బిచ్చగాడిలా ఉన్నాడు. వెనుక శివ‌పార్వ‌తుల ఫోటో.. ముందు నిల్చుని నవ్వుతున్న ధ‌నుష్ లుక్ ఇంట్రస్టింగ్‌గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో ఆర్ ఆర్ కూడా క్యూరియాసిటీని రెట్టింపు చేస్తోంది. గ్యాంగ్‌స్టర్‌ మూవీలో ధనుష్ ఈ రకమైన గెటప్‌తో ఉండడం ఏంటా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. టైటిల్ కి పూర్తి కాంట్రాస్ట్ గా ధ‌నుష్ లుక్ ఉండ‌టమే ఇక్కడ స‌స్పెన్స్ అని అనిపిస్తోంది. ఫ‌స్ట్ లుక్ తోనే సినిమా మీద ఇంప్రెషన్ కలిగేలా చేయడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల స‌క్సెస్ అయ్యాడు. ధ‌నుష్ లుక్ ని ఇన్నోవేటివ్ గా డిజైన్ చేయ‌డంతో ఆ పాత్ర వైవిథ్యంగా ఉంటుంద‌ని చెప్పకనే చెబుతున్నాడు. మ‌రి బిచ్చ‌గాడిలో ధ‌నుష్ చూపించిన నేప‌థ్యంలో అప‌ర కుబేరుడి గా కింగ్ నాగార్జున లుక్ ఉంటుందా? అని చర్చించుకుంటున్నారు తెలుగు మూవీ లవర్స్.

ఈ సినిమాలో ధనుష్, నాగార్జునతో పాటూ రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. శేఖర్ కమ్ములా సినిమాల్లో హీరోయిన్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పాత్ర కోసం రష్మికను తీసుకోవడంతో మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఏషియన్‌ సినిమాస్‌- శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

#kubera #dhanush #sekhar-kammula #movies #nagarjuna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి