Viral Video: సాధారణంగా మనం పులులను జూలో చూస్తుంటాం. అయితే అడవిలో పులులను చూడటం అరుదు అనే చెప్పాలి. జూలో కనిపించే పులులు మాములుగానే తిరుగుతూ కనిపిస్తాయి. పులుల సాహసాలు, వేటాడే విధానం మనం అస్సలు చూడలేం.
ఇటీవల పెద్దపులికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమబెంగాల్‌లోని సుందర్‌బన్ నేషనల్ పార్క్‌లో నదిని దాటేందుకు పెద్దపులి చేసిన సాహసాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఘటనలు చూడటం చాలా అరుదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పార్క్‌లో నదిలో ఇవతలి గట్టు నుంచి అవతలిగట్టు చాలా దూరం ఉంది. అక్కడికి వచ్చిన ఓ పెద్ద పులి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి అవతలివైపునకు దూకిన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి గూస్‌బంమ్స్ రావడం ఖాయం. ట్విట్టర్‌లో ఓ వ్యక్తి ఈ వీడిను షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటికే 1,10,000 కుపైగా వ్యూస్ వచ్చాయి. వేల లైక్‌లు కూడా వస్తున్నాయి.
ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూడటం చాలా అరుదు అని..ఇలాంటి అద్భుతమైన వీడియోని తీసిన కెమెరామెన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
గత నెలలో కూడా ఓ పులి ప్లాస్టిక్ బాటిల్‌ను నోటితో పట్టుకుని తీసుకెళ్లే వీడియో కూడా వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని అంధారి టైగర్ రిజర్వ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణంపై ప్లాస్టిక్ ప్రభావం ఎంతగా ఉందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: జీలకర్రతో ఎంతటి గ్యాస్ ట్రబులైనా పరార్.. మలబద్ధకం మాయం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది.