Nirmal: కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధం
కవ్వాల్ టైగర్ రిజర్వులోని గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాలను కోర్ ఏరియా వెలుపల ఉన్న ధర్మాజిపేటకు నెలరోజుల్లో తరలించనున్నారు. వీరి కోసం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.