Viral Video: సెల్‌ఫోన్‌కు బానిసై కన్నకూతురిని ఏం చేసిందో చూడండి

ఓ మహిళ ఫోన్‌లో మాట్లాడుకుంటూ కూరగాయలు కట్‌ చేస్తోంది. పొరపాటున కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా పక్కనే ఆడుకుంటున్న పాపను పెట్టింది. ఆమె భర్త ఇంటికి వచ్చి పాప లేకపోవడంతో అంతా వెతకడం మొదలుపెట్టాడు. చివరికి ఫ్రిడ్జ్‌లోంచి వచ్చే పాప ఏడుపులు విని డోర్‌ తెరిచి చూసి షాక్‌ అయ్యాడు.

Viral Video: సెల్‌ఫోన్‌కు బానిసై కన్నకూతురిని ఏం చేసిందో చూడండి
New Update

Viral Video: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ దీనికి బానిసలుగా మారిపోయారు. చాలా మంది ప్రజలు వాస్తవ ప్రపంచంతో ఇంటరాక్ట్ కాకుండా ఫోన్‌లలో నిమగ్నమైపోతున్నారు. ఓ మహిళ సెల్‌ఫోన్‌కు బానిసగా మారి చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలేం జరిగిందంటే.. ఓ మహిళ ఫోన్‌లో మాట్లాడుకుంటూ కూరగాయలు కట్‌ చేస్తోంది. పొరపాటున కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టకుండా పక్కనే ఆడుకుంటున్న పాపను తీసుకెళ్లి అమాంతం ఫ్రిజ్‌లో పెట్టి డోర్‌ వేసేసింది.

తర్వాత ఫోన్‌ మాట్లాడుకుంటూనే ఇతర పనుల్లో నిమగ్నమైంది. తర్వాత ఆమె భర్త ఇంటికి వచ్చి పాప లేకపోవడంతో అంతా వెతకడం మొదలుపెట్టాడు. చివరికి ఫ్రిజ్‌లోంచి వచ్చే పాప ఏడుపులు విని డోర్‌ తెరిచి చూసి షాక్‌ అయ్యాడు. ఇదంతా సీసీ టీవీలో రికార్డ్‌ అయింది. సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో ఓ యూజర్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు 3.9 లక్షల వ్యూస్‌ వచ్చాయి.

publive-image

ఇది చూసిన నెటిజన్లు కాస్త లేట్‌ అయి ఉంటే ఏం ఘోరం జరిగిపోయేదో అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఎన్ని పనులు ఉన్నా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఫేక్‌ వీడియో అంటూ మరికొందరు కొట్టిపారేస్తున్నారు. పాప పట్టేంత స్పేస్‌ ఉంటుందా.. ఆమె భర్త కూడా ఆస్కార్‌ రేంజ్‌లో నటిస్తూ ఫ్రిజ్‌ దగ్గర డ్రామాలు చేశాడంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒక వేళ అది నిజం అయిఉంటే ఇలాంటి తల్లిదండ్రులను అస్సలు క్షమించకూడదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

2023 జులైలో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఒక మహిళ ఫోన్‌లో ఏదో చూస్తూ ఆగిపోయి ఉన్న ఎస్కలేటర్‌పై నిలబడింది. ఆమె పక్కన ఉన్నవారంతా అది పనిచేయకపోవడంతో మెట్లు ఎక్కుతూ ఉన్నారు. మహిళ మాత్రం ఫోన్‌లో నిమగ్నమై ఎస్కలేటర్‌ ఆగిపోయింది కూడా గమనించలేదు. ఆ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోకు 12 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.

ఇది కూడా చదవండి: మైగ్రేన్‌ లక్షణాలు స్త్రీల కంటే మగవారిలో భిన్నంగా ఉంటాయా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#viral-video #woman #phone-addiction #fridge-baby
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe