Pulwama Encounter: పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు..!!

జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. టెర్రరిస్టులు ఓ ఇంట్లో దాక్కుతున్నట్లు పక్కాసమాచారంలో దాడి చేశాయి భద్రతాదళాలు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

New Update
Pulwama Encounter: పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు..!!

Pulwama Encounter : దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామాలోని పరిగామ్‌లో ఆదివారం అర్థరాత్రి భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదుల (Terrorists)ను హతమార్చాయి. ఓఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నారని భద్రతాదళాలకు సమాచారం అందింది. పక్కా సమాచారంతోనే అక్కడికి వెళ్లిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు ఆటోమెటిక్ ఆయుధాలతో ఎదురుదాడికి పాల్పడ్డాయి. అయితే, భద్రతా బలగాలు(Security Forces) ఉగ్రవాదులను అన్ని వైపుల నుండి చుట్టుముట్టాయి. టెర్రరిస్టుల తప్పించుకునే అవకాశం లేకుండా చేశారు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ఆపరేషన్ ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతాదళాలు.

పరిగం నీవాలో ఆటోమేటిక్ ఆయుధాలతో ముగ్గురు ఉగ్రవాదుల బృందం కనిపించినట్లు రాత్రి 7.30 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. అదే సమయంలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆర్మీ (Army), సీఆర్‌పీఎఫ్‌ (CRPF) సిబ్బందితో పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా దళాలు గ్రామం ముట్టడి ప్రారంభించిన వెంటనే, ఒక ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతాదళాలను చూశారు. సీజ్‌ను ఛేదించేందుకు ఉగ్రవాదులు జవాన్లపై గ్రెనేడ్ విసిరి, ఆపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగింది.

సమాచారం ప్రకారం, కాల్పుల్లో ఎటువంటి హాని జరగకుండా భద్రతా దళాలు ఉగ్రవాదుల స్థావరానికి ఆనుకుని ఉన్న ఇళ్ల నుండి చాలా మందిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లాయి. ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశం లేకుండా భద్రతా బలగాలు నలువైపుల నుంచి ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని చుట్టుముట్టాయి. అర్థరాత్రి ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైన రెండు వారాల తర్వాత ఇది జరిగింది. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా, ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, J&K పోలీసుల సంయుక్త ఆపరేషన్ ఆగస్టు 5న ప్రారంభించింది. ఆగస్ట్ 5 ఆపరేషన్ ప్రారంభించటానికి ఒక రోజు ముందు, జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో (Jammu and Kashmir's Kulgam) ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించారు .

Also Read: ఛత్తీస్‌ఘడ్‌లో 40 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు