Prajwal Revanna : ప్రజ్వల్ రేవన్న ఇంటికి సిట్ అధికారులు.. రెండోసారి లుక్ఔట్ నోటీసులు లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండోసారి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు శనివారం హాసనలో ప్రజ్వల్ ఇంటికి వెళ్లారు.ఈ కేసులో ఆయన ఇంట్లో ఉన్న సిబ్బందిని ప్రశ్నించనున్నారు. By B Aravind 04 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి SIT Officers : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ(Deve Gouda) కొడుకు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌పై నమోదైన లైంగిక దౌర్జన్యం(Sex Scandal) దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు శనివారం హాసనలో ప్రజ్వల్ ఇంటికి వెళ్లారు. అభ్యంతర వీడియోల విచారణలో భాగంగా ఆయన ఇంట్లో ఉన్న సిబ్బందిని ప్రశ్నించనున్నారు. అలాగే ప్రజ్వల్‌పై రెండోసారి లుక్ఔట్ నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. ఆయన తండ్రి రేవణ్ణ కూడా విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నందు వల్ల ఆయనకు కూడా నోటిసిలిచ్చినట్లు చెప్పారు. Also Read: భార్యను కొట్టి చంపిన ఆర్థిక మంత్రి.. వీడియో వైరల్ అయితే ఈ కేసుపై ఇటీవలే సిట్ విచారణకు పిలిచింది. కానీ తనకు సమయం కావాలని ప్రజ్వల్(Prajwal Revanna) ను కోరారు. అధికారులు ఇందుకు తిరస్కరించారు. ఆ తర్వాత లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు వ్యవహాం బయటపడటంతో ప్రజ్వల్ దేశం విడిచిపోరిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నారు. ఈ నోటీసుల వల్ల ప్రజ్వల్ దేశంలోకి అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం లేఖ రాశారు. ఈ దారుణాలకు పాల్పడ్డ వ్యక్తులకు శిక్షించాలని.. బాధితులకు అవసరమైన సాయం చేయాలని కోరారు. అలాగే ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసి.. ఇండియాకు రప్పించేలా ప్రధాని మోదీకి కూడా విజ్ఞప్తి చేశామని తెలిపారు. #Congress leader #RahulGandhi writes to #Karnataka CM Siddaramaiah regarding Prajwal Revanna's alleged #SexuallyAssaulted videos case. He writes, "..kindly extend all possible support to the victims of horrific Sexual violence unleashed by the #Hasaan MP #PrajwalRevanna..." pic.twitter.com/FUnhPEtQew — Surya Reddy (@jsuryareddy) May 4, 2024 Also Read: భార్యతో అసహజ శృంగారం నేరం కాదు : హైకోర్టు #telugu-news #national-news #prajwal-revanna #sex-scandal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి