Hair Care: సీజన్ మారింది..జుట్టు సంరక్షణలో ఈ మార్పులు చేసుకోండి ప్రతి సీజన్‌లో జుట్టుకు నూనె రాయడం మర్చిపోవద్దు. తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తగినన్ని పోషకాలు అందుతాయి. జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఆర్గాన్, భృంగరాజ్, లావెండర్, మందార లేదా కొబ్బరి వంటి నూనె రాసుకోవాలి. By Vijaya Nimma 02 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Hair Care: మారుతున్న వాతావరణంతో పాటు జుట్టు సంరక్షణలో కూడా మార్పు అవసరం. ఆహారం, తలస్నానం, నూనె పెట్టడం వరకు ప్రతి విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వాతావరణం మారుతున్న కొద్దీ దానికి అనుగుణంగా చర్మాన్ని సంరక్షించే విధానాన్ని కూడా మార్చుకుంటాం. కానీ జుట్టు గురించి మర్చిపోతుంటాం. వాతావరణం మారగానే చర్మం, జుట్టు విషయంలో కూడా మార్పులు వస్తుంటాయి. అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా హెయిర్ కేర్ రొటీన్ కూడా మారాలి. జుట్టు సంరక్షణ ఎలా..? అన్ని న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే డైట్ తీసుకోవడం వల్ల స్కాల్ప్, హెయిర్ ఆరోగ్యకరంగా ఉంటాయి. వాతావరణంలో మార్పు కారణంగా మన ఆహారపు అలవాట్లు కూడా మారుతాయి. ఇది జుట్టు దెబ్బతినడానికి మరొక కారణం కావచ్చు. ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. ప్రోటీన్లను తీసుకుంటూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. పౌష్టికాహారం జుట్టు ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నూనె రాసుకోవాలి: ప్రతి సీజన్‌లో జుట్టుకు నూనె రాయడం మర్చిపోవద్దు. కనీసం వారానికి ఒకటి లేదా రెండుసార్లు మూలాల నుంచి చివరల వరకు నూనె రాయాలి. తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల తగినన్ని పోషకాలు అందుతాయి. జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. జుట్టుకు మనం వాడే నూనె ఎప్పుడూ ఒకేలా ఉండాలి. ఆర్గాన్, భృంగరాజ్, లావెండర్, మందార లేదా కొబ్బరి వంటి నూనె రాసుకోవాలి. స్కాల్ప్ శుభ్రంగా ఉంచుకోవాలి: వాతావరణంలో మార్పు వల్ల జుట్టు పొడిగా, జిడ్డుగా మారుతుంది. వేడి, తేమతో కూడిన వాతావరణంలో అధిక సెబమ్, చెమట వస్తుంది. దాని కారణంగా తలలోని చర్మం జిడ్డుగా మారుతుంది. సూర్యకాంతి, వేడి కారణంగా జుట్టు పొడిగా మారుతుంది. అందుకే వెంట్రుకలను శుభ్రంగా, తేమగా ఉంచుకోవాలి. వారానికి కనీసం మూడుసార్లు షాంపూ, కండీషనర్ ఉపయోగించాలి. హెయిర్ ట్రిమ్మింగ్: హెయిర్ ట్రిమ్మింగ్ చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని, ఆకృతిని మెరుగుపరుస్తుంది. చివర్లు చిట్లడం తగ్గి జుట్టు ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. ప్రతి 3 నుంచి 4 నెలలకు జుట్టును కత్తిరించడం మంచిది. ఇది కూడా చదవండి: ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-care #hair-care #season మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి