Alluri District: మన్యం ప్రాంతంలో కొనసాగుతున్న వరద తీవ్రత
అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వరద వల్ల అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరద సహాయ చర్యలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం తోపాటు.. సహాయక చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజలు వరద నీరు వల్ల బయటకు రావద్దని వాతావరణ అధికారులు వెల్లడించారు. మరో 3 మూడు రోజులు భారీ వర్షాలు ఇలానే ఉంటాయని తెలిపారు.