హైదరాబాద్‌లో రెండు గంటల పాటు దంచికొట్టిన వాన
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం దంచికొట్టింది. పంజాగుట్ట, అమీర్ పేట్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, ముషీరాబాద్, కూకట్ పల్లి, లింగంపల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ,జూబ్లిహిల్స్, కోఠి, మోహిదీపట్నం, బేగంపేట్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్ తో పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
కూలిన ఎయిర్ పోర్టు సీలింగ్.... బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం...!
అండమాన్‌లో వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టెర్మినెల్ భవనంలో సీలింగ్‌లో ఓ భాగం కూలి పోయింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కొద్ది రోజులకే సీలింగ్ ఊడిపోవడంతో బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.
దమ్ముంటే.. దళితబంధు,బీసీబంధు పై శ్వేత పత్రం విడుదల చేయాలి!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు ఆర్థిక సహాయం చేయని ప్రభుత్వం తెలంగాణలోనే ఉందన్నారు. దళితులకు భూమి ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారని ఆయన ధ్వజమెత్తారు.
అభిమానుల మృతిపై స్పందించిన సూర్య.. అండగా ఉంటానని భరోసా
పల్నాడు జిల్లా నరసరావుపేటలో అభిమానుల మృతిపై హీరో సూర్య స్పందించారు. మృతుల కుటుంబసభ్యులతో వీడియో కాల్ మాట్లాడిన ఆయన అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సూర్య పుట్టిన రోజు సందర్భంగాఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు విద్యార్థులు చనిపోయిన సంగతి తెలిసిందే.
ఒక్కసారిగా పైకి దూసుకొచ్చిన ఏనుగు, భయపడిన బస్ ప్రయాణికులు
నిత్యం సోషల్‌మీడియాలో ఏదో ఒక వింత ఘటనకు సంబంధించిన చాలా వీడియోలను మనం చూస్తూనే ఉంటాం.. అందులో ఒకటి భయానకం అయితే.. మరొకటి ఆనందపరిచే వీడియోలు ఉంటాయి. అయితే ఇక్కడ వీడియోలో మాత్రం ఓ ఏనుగు బస్‌కు ఎదురుగా వచ్చి అందులోని ప్రయాణికులను హడల్ ఎత్తించింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఇంట్రెస్టింగ్ వీడియోను (Viral Video)పోస్ట్ చేశారు.
డబుల్ బెడ్ రూమ్ సమస్యల ఎజెండాతో బీజేపీ ఫైట్ !
డబుల్ బెడ్రూమ్ సమస్యలపై బీజేపీ చేపట్టిన మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(జులై 25) ధర్నా చౌక్‌లో నిరసన చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఒక కేబినెట్ మినిస్టర్ ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటని హైకోర్టు నిలదీసింది.
టమాటా దొంగలున్నారు జాగ్రత్త..!
టమాటా ధరలు విపరీతంగా పెరగడంతో దేశంలో చిత్రవిచిత్ర ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. టమాటా దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పొలాల్లో పండించిన పంటతో పాటు కూరగాయల షాపుల్లో ఉన్న టమాటాలను సైతం దొంగలిస్తున్నారు. తాజాగా ఏకంగా టమాటా లోడుతో వెళ్తున్న ట్రక్కును హైజాక్ చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది.