ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ప్రజా సమస్యలపై పోరుబాట పట్టింది. రేషన్ కార్డుల పంపిణీ, ధరణి రద్దుతో పాటు డబుల్ బెడ్ సమస్యలనే ఎజెండాగా చేసుకొని ఆందోళనకు దిగుతోంది. ఇందులో భాగంగా ముందుగా అన్ని జిల్లా కేంద్రాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలపై ఈ రోజు నుంచి ధర్నాలు చేసేందుకు సిద్ధమైంది బీజేపీ. రేపు హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నాకు పిలుపునిచ్చారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దీనికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.
పూర్తిగా చదవండి..డబుల్ బెడ్ రూమ్ సమస్యల ఎజెండాతో బీజేపీ ఫైట్ !
డబుల్ బెడ్రూమ్ సమస్యలపై బీజేపీ చేపట్టిన మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(జులై 25) ధర్నా చౌక్‌లో నిరసన చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఒక కేబినెట్ మినిస్టర్ ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటని హైకోర్టు నిలదీసింది.

Translate this News: