గ్రామాన్ని ముంచేసిన వరద..బిల్డింగులు, చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకున్న ప్రజలు!
ఎడతెరిపి లేకుండా జోరుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయి. ఆ వరదలోనే గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. మొరంచపల్లి గ్రామాన్ని వరద మొంచెత్తుతోంది. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో గ్రామస్తులు బిల్డింగులు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. అయితే వరద ప్రవాహం పెరుగుతూనే పోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.దీంతో తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు.