మేడమ్ ప్రెసిడెంట్, గవర్నర్ మేడమ్ మీరేం చేస్తున్నారు. మణిపూర్ ఘటనపై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్..!!
మణిపూర్ ఘటనపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. మేడమ్ ప్రెసిడెంట్,గవర్నర్ మేడమ్ మీరేం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి... దేశంలో ఏం జరుగుతుంది..దానిపై మీ పాత్ర ఏమిటి? మణిపూర్ గవర్నర్ ఉకేని కూడా ప్రశ్నించారు థాకరే.