/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-16-2-jpg.webp)
Special Trains for Dussehra: దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ(Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వేళ కొత్తగా మరో తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ప్రకటన ప్రకారం..
ప్రత్యేక రైళ్ల వివరాలు..
🚊 రైలు నంబర్ 07041 (సికింద్రాబాద్-తిరుపతి) అక్టోబర్ 19న సికింద్రాబాద్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
🚊 రైలు నెం 07042 (తిరుపతి-సికింద్రాబాద్) అక్టోబర్ 20వ తేదీన తిరుపతిలో రాత్రి 7:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
🚊 ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, రాయచూర్, మంత్రాలయం రోడ్ (రైలు నెం. 07042 మాత్రమే), గుంతకల్, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్‌లలో ఆగుతాయి.
🚊 రైలు నెం 07065 (సికింద్రాబాద్ - కాకినాడ టౌన్) అక్టోబర్ 23వ తేదీన సికింద్రాబాద్ నుండి రాత్రి 7 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:10 గంటలకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంది.
ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..
🚊 రైలు నంబర్ 07066 (కాకినాడ టౌన్-సికింద్రాబాద్) అక్టోబర్ 24న కాకినాడ టౌన్ నుండి రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
🚊 ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి.
🚊 రైలు నెం 07489 (సికింద్రాబాద్-తిరుపతి) అక్టోబర్ 21న సికింద్రాబాద్ నుండి రాత్రి 10:50 గంటలకు బయలుదేరి ఉదయం 9:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
🚊 రైలు నెం 07490 (తిరుపతి-సికింద్రాబాద్) అక్టోబర్ 22న తిరుపతిలో సాయంత్రం 4:35 గంటలకు బయలుదేరి ఉదయం 4:50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
🚊 ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి.
🚊 రైలు నెం -07653 (కాచిగూడ-కాకినాడ టౌన్) కాచిగూడ నుండి రాత్రి 9:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన ప్రయాణ తేదీ అక్టోబర్ 19, 26.
🚊 రైలు నెం 07654 (కాకినాడ టౌన్ - కాచిగూడ) కాకినాడ టౌన్ నుండి సాయంత్రం 5:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ప్రయాణ తేదీ అక్టోబర్ 20, 29.
🚊 ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి.
SCR to run festival special trains between various destinations @drmsecunderabad @drmgtl @drmhyb pic.twitter.com/MQK0DSanUj
— South Central Railway (@SCRailwayIndia) October 18, 2023
కొన్ని రైళ్ల పునరుద్ధరణ
గతంలో రద్దు చేసిన కొన్ని రైళ్లను పునరుద్ధరించింది దక్షిణ మధ్య రైల్వే (SCR). రైలు నెం - 12806 (లింగంపల్లి-విశాఖపట్నం), గత నెల రద్దు చేయబడం జరిగింది. దీనిని అక్టోబర్ 18 నుండి అది పునరుద్ధరించడం జరిగింది. రైలు నెం - 128065 (విశాఖపట్నం- లింగంపల్లి) ఇది అక్టోబర్ 17 నుండి పునరుద్ధరించడం జరిగింది.
ఇదికూడా చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..