Viral Video: మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని జగదీష్ చంద్రబోస్ ఏనాడో చెప్పారు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు మొక్కలు మాట్లాడుకుంటాయని రుజువు చేశారు. రెండు మొక్కల మధ్య పరస్పర చర్యను గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఎయిర్ పంప్‌ను ఉపయోగించారు. ఈ ప్రయోగం ఆవపిండి కుటుంబానికి చెందిన ఒక సాధారణ కలుపు, అరబిడోప్సిస్ థాలియానా మొక్కలపై చేశారు. జపాన్ శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనలో మొక్కలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడం గమనించవచ్చు. అంతేకాకుండా శాస్త్రవేత్తలు ఒక వీడియోను రికార్డ్ చేశారు. ఈ ఫుటేజీలో రెండు మొక్కలు తమలో తాము చర్చలు జరుపుతున్నాయి. మొక్కలు వాయుమార్గంలో ఒకదానితో ఒకటి సంకర్షణ చెందుతాయని, ఏదైనా ప్రమాద సమయంలో ఒకదానికొకటి సందేశాలను పంపుకుంటాయని అంటున్నారు.
జపనీస్ శాస్త్రవేత్తలు రికార్డ్ చేసిన ఈ వీడియోలో మొక్కలు ఎయిర్ అలారాలను ఎలా స్వీకరిస్తాయో, ఎలా స్పందిస్తాయో కనిపించింది. సైతామా విశ్వవిద్యాలయానికి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ నాయకత్వంలో ఈ ప్రయోగం చేశారు. ఇది నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించబడింది.ఈ బృందం తమ ప్రయోగంలో అస్థిర సేంద్రియ సమ్మేళనాలకు మొక్కలు ఎలా స్పందిస్తాయో గుర్తించింది. అంతేకాకుండా మొక్కలు యాంత్రికంగా లేదా దెబ్బతిన్న పొరుగు మొక్కల ద్వారా విడుదలయ్యే VOCలను అర్థం చేసుకుంటాయి. విభిన్న రక్షణ ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయని అంటున్నారు. ఇంటర్‌ప్లాంట్ కమ్యూనికేషన్ అనేది పర్యావరణ ప్రమాదాల నుంచి మొక్కలను రక్షిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు ఆకులు, గొంగళి పురుగుల కంటైనర్‌తో ఉన్న గాలి పంపును ప్రయోగంలో ఉపయోగించారు. ప్రయోగం కోసం అరబిడోప్సిస్ థాలియానా అనే ఆవపిండి కుటుంబంలో ఒక సాధారణ కలుపును ఎంచుకున్నారు.
ప్రయోగం ఎలా జరిగింది..?
అరబిడోప్సిస్ థాలియానా నుంచి కత్తిరించిన ఆకులను తినడానికి గొంగళి పురుగులను వదిలారు. ఆ తర్వాత బయో సెన్సర్లను పెట్టారు. ప్రమాదం జరగగానే అరబిడోప్సిస్ మొక్కలు ప్రతిచర్యను ప్రారంభించాయి. కాల్షియం సిగ్నలింగ్‌ను ఇతర మొక్కలకు పంపడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కాల్షియం సిగ్నలింగ్ అనేది మానవ కణాల్లోనూ ఉంటుందని, పరస్పర కమ్యూనికేషన్ కోసం ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: క్యారెట్లను ఇలా తీసుకుంటే రోగనిరోధక శక్తి రెట్టింపు..ఇంకా ఎన్నో ప్రయోజనాలు