Arvind Kejriwal : కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై విచారిస్తాం : సుప్రీంకోర్టు

లోక్‌సభ ఎన్నికల నేఫథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను మే 7న విచారిస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)కు తెలిపింది. విచారణకు సిద్ధమై రావాలని ఆదేశించింది.

CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్.. సీఎం కేజ్రీవాల్ కు ఊరట దక్కేనా?
New Update

Supreme Court : దేశంలో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) దశల వారిగా జరుగుతున్నాయి. అయితే ఢిల్లీలోని ఎన్నికల నేఫథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను మే 7న విచారిస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) కు తెలిపింది. ఈ క్రమంలోనే విచారణకు సిద్ధమై రావాలని ఈడీ తరఫు న్యాయవాదికి.. ధర్మాసనం ఆదేశించింది.

Also Read: అమిత్‌ షా వీడియో మార్పింగ్ కేసుపై హైకోర్టు స్టే..

అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు సమయం పట్టే అవకాశం ఉందని.. అందుకే ఆయన మధ్యంత బెయిల్‌ పిటిషన్‌ విచారణను పరిశీలిస్తామని సప్రీం తెలిపింది. అయితే మధ్యంతర బెయిల్ పటిషన్‌ను తాము వ్యతిరేకిస్తామని ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు అన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. కేవలం పిటిషన్‌ను మాత్రమే విచారిస్తాం, బెయిల్ ఇస్తామని చెప్పడం లేదని స్పష్టం చేసింది. చివరికి బెయిల్ ఇవ్వొ్చ్చు, ఇవ్వకపోవచ్చు అని చెప్పింది. ఇందుకోసం వాదనల కోసం సిద్ధమై రావాలని ఈడీకి సుప్రీం ధర్మాసనం సూచనలు చేసింది.

ఇదిలాఉండగా.. లిక్కర్‌ కేసులో మార్చి 21న సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే తాజాగా కేజ్రీవాల్ పిటిషన్‌ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. మరీ ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Also read: 2026లో భారత్ ముక్కలుగా విడిపోతుంది: పాకిస్థాన్‌ మాజీ సెనేటర్

#telugu-news #national-news #supreme-court #arvind-kejriwal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe