Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషులకు చుక్కెదురు.. పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

బిల్కిస్ బానో కేసులో రెమిషన్ (శిక్ష తగ్గింపు) చెల్లదని జనవరి 8న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. ఇద్దరు దోషులు మళ్లీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే జస్టీస్ సంజీవ్ ఖన్నా, సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. ఇది తప్పుడు పిటిషన్‌ అంటూ తాజాగా దీన్ని కొట్టివేసింది.

Supreme Court on Promotions: ప్రమోషన్స్ విషయంలో అలా చేస్తే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే: సుప్రీంకోర్టు 
New Update

Supreme Court : బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులకు చుక్కెదురైంది. వాళ్లు దాఖలు చేసిన పటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రెమిషన్ (శిక్ష తగ్గింపు) పై కోర్టు నిర్ణయం తీసుకునే వరకు తమకు బెయిల్‌ ఇవ్వాలని దోషులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు శుక్రవారం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇది పూర్తిగా తప్పుడు పిటిషన్ అని జస్టీస్ సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna), సంజయ్‌ కుమార్‌ (Sanjay Kumar) లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కోర్టులో ఒక ధర్మాసనం జారీ చేసిన ఆర్డర్‌పై మరోక ధర్మాసనం ఎలా అప్పీల్ చేస్తుందని ప్రశ్నించింది.

అయితే దోషులు రాధేశైమ్‌ భగవాన్‌దాస్ షా, రాజుభాయ్‌ బాబూలాల్ సోనీ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి పర్మిషన్ కోరగా ఇందుకు ధర్మాసనం పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు భగవాన్‌దాస్ షా మధ్యంతర బెయిల్‌ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా బిల్కిస్ బానో కేసు (Bilkis Bano Case) లో గత 14 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న దోషులకు 2022లో గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్ మంజూరు చేసింది. దీంతో వీళ్లందరూ ఆగస్టు 15న జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బిల్కీస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం.. వారి విడుదల చెల్లదంటూ ఈ ఏడాది జనవరి 8న తీర్పునిచ్చింది. రెండు వారాల్లోనే అధికారుల వద్ద లొంగిపోవాలంటూ ఆదేశించింది.

Also Read: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 35 విమానాలు రద్దు

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును జనవరి 8న రెమిషన్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. ఇద్దరు దోషులు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఇది 2002 రాజ్యాంగ ధర్మాసనం తీర్పుకు విరుద్ధంగా ఉందని.. చివరి నిర్ణయం కోసం దీన్ని పెద్ద ధర్మాసనంకు సూచించాలని కోరారు. కోర్టు నిర్ణయం తీసుకునే వరకు తమకు బెయిల్‌ ఇవ్వాలని అభ్యర్థించారు. చివరికి అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది.

ఇదిలాఉండగా.. 2002లో గోద్రా రైలు దహనకాండ జరిగిన తర్వాత గుజరాత్‌లో పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు చోటుకున్నాయి. ఈ క్రమంలో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులను హత్య చేశారు. అలాగే అప్పటికే 5 నెలల గర్భిణిగా ఉన్న బానోపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఈ కేసులో 11 మంది దోషులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Also Read: మనుషుల ఆయుష్షు పెంచే ప్రయోగం సక్సెస్‌..

#telugu-news #national-news #supreme-court #bilkis-bano-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe