Toll Gates: ఫాస్టాగ్ ప్లేస్‌లో శాటిలైట్ టోల్.. రోడ్ ఎక్కితే చాలు డబ్బులు కట్టాల్సిందే!

దూర ప్రయాణాలు చేసేటప్పుడు హైవేపై టోల్‌ గేట్‌ ఉండే రూట్‌లో వెళ్తే రుసుము చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇకనుంచి హైవేపై టోల్‌ బూత్‌ వరకు వెళ్లకున్నా కాస్త దూరమే ప్రయాణించినా సదరు వాహనంపై టోల్‌ రుసుము కట్‌ కానుంది.త్వరలో ఇలాంటి కొత్త శాటిలైట్‌ విధానాన్ని కేంద్రం అమలు చేయనుంది.

New Update
Toll Gates: ఫాస్టాగ్ ప్లేస్‌లో శాటిలైట్ టోల్.. రోడ్ ఎక్కితే చాలు డబ్బులు కట్టాల్సిందే!

దూర ప్రయాణాలు చేసేటప్పుడు హైవేపై టోల్‌ గేట్‌ ఉండే రూట్‌లో వెళ్తే రుసుము చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇకనుంచి హైవేపై టోల్‌ బూత్‌ వరకు వెళ్లకున్నా కాస్త దూరమే ప్రయాణం చేసినా ఆ వాహనంపై టోల్‌ రుసుము కట్‌ కానుంది. ఇలాంటి కొత్త విధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వచ్చే ఏడాదికి ప్రాథమిక స్థాయిలో ఇది అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దశల వారిగా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు.

ఇప్పుడు దేశంలో ఫాస్టాగ్‌తో అనుసంధానమై టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. గతంలో మాన్యువల్‌గా టోల్‌ ఫీజు వసూలు చేసేవారు. అక్కడ సిబ్బందికి రుసుము చెల్లించి రశీదు తీసుకొనాల్సి వచ్చేది. ఆ తర్వాత ఈ పద్ధతిని తొలగించి సెన్సార్లు, ఫాస్టాగ్‌ స్టిక్కర్‌ను రీడ్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల డైరెక్ట్‌గా ఖాతా నుంచి డబ్బులు కట్‌ అవుతాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి పూర్తి భిన్నంగా కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌తో అనుసంధానమయ్యే ఈ కొత్త టోల్‌ వ్యవస్థ అసలు టోల్ బూత్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. వాహనాలు టోల్‌ రోడ్ మీద తిరిగిన దూరాన్ని శాటిలైట్ సాయంతో గుర్తించి టోల్‌ను లెక్కిస్తుంది. ఈ వ్యవస్థతో లింక్‌ అయి ఉన్న ఖాతా నుంచి టోల్‌ ఫీజు కట్ అవుతుంది.

Also read:  ఆ కేసును సీబీఐకి బదిలీ చేయండి.. అమిత్‌ షాకు రాజాసింగ్‌ లేఖ..

ఇక టోల్‌బూత్‌లే ఉండవు

గతంలో మాన్యువల్‌ టోల్‌ కట్టేటప్పుడు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకురావడంతో.. వాహనం టోల్‌ బూత్‌లోకి రాగానే సెన్సార్లు ఫాస్టాగ్‌కు రీడ్‌ చేసి టోల్‌ ఫీజును డిడక్ట్ చేస్తాయి. దీనివల్ల వాహనాల ఎక్కువసేపు బారులు తీరాల్సి ఉండాల్సిన అవసరం ఉండదని మొదటగా భావించారు. కానీ సెన్సార్లు సరిగా పనిచేయకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ఇప్పటికీ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్‌ విధానాన్ని తీసుకొస్తోంది. ఈ విధానంలో వాహనం ప్రయాణిస్తున్న సమయంలో క్షణాల్లోనే టోల్‌ లెక్కించడం, డబ్బులు డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. అంతేకాదు అసలు టోల్‌బూత్‌లే ఉండవు. దీంతో వాహనాలు ఎక్కడా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉండదు.

ప్రభుత్వానికి మరింత ఆదాయం

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తోంది. దీంతో ఇప్పుడు మరింత ఆదాయం పెరగనుంది. ఎలాగంటే.. ఇప్పటివరకు టోల్‌ గేట్లు వచ్చేలోపే దారి మళ్లి వెళ్లే వాహనాల వల్ల ఆదాయం వచ్చేది కాదు. కానీ ఈ కొత్త శాటిలైట్ విధానంలో మాత్రం టోల్‌ రోడ్డుపై వాహనాలు కొంచెం దూరం ప్రయాణించినా కూడా టోల్‌ ఫీజు కట్‌ అవుతుంది. దీనివల్ల కేంద్రానికి టోల్ నుంచి వచ్చే ఆదాయం కనీసం మూడు రెట్టు పెరుగుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు టోల్‌ బూత్‌ నిర్వహణకు ఖర్చు కూడా ఉండదు.

శాటిలైట్‌తో అనుసంధానమై

ముందుగా టోల్‌ రోడ్లను శాటిలైట్లు గుర్తించేందుకు వీలుగా ఆయా మార్గాల్లో ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. ఇవి ఉపగ్రహంతో అనుసంధానమై పనిచేస్తాయి. వాహనాల్లో ఆన్‌బోర్డ్‌ యూనిట్‌లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి జీపీఎస్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. ఇవన్నీ పరస్పరం సమన్వయం చేసుకుంటూ.. సదరు వాహనం టోల్‌ రోడ్డుపై ఎంత దూరం ప్రయాణించిందో కచ్చితంగా గుర్తిస్తాయి. వాహనాదారు బ్యాంకు ఖాతాతో టోల్‌ వసూలు వ్యవస్థ లింక్ అయి ఉంటుంది. ఏ ప్రాంతంలో టోల్‌ రోడ్డుపైకి వాహనం వచ్చింది. ఏ ప్రాంతంలో హైవేపై దిగింది అనే విషయాలను వెంటనే నమోదు చేసి.. సంబంధిత ఖాతా నుంచి డబ్బులు కట్ చేసుకుంటుంది. ఈ కొత్త టోల్‌ వ్యవస్థకు సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి వ్యక్తీకరణ (EOI) నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది.

Also Read: 10 అడుగుల గదికి రూ. 12 వేలు.. ఇదీ సివిల్స్‌ విద్యార్థుల దుస్థితి

స్థానికంగా ఉండేవారికి నష్టం

ముందుగా మైసూరు - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే, హర్యానాలోని పానిపట్ - హిస్సార్‌ హైవేలపై ప్రయోగత్మకంగా దీన్ని పరిశీలించన్నారు. మరో ఏడాదిలో దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. కానీ దీనికి మరింత సమయం పట్టే ఛాన్స్ ఉందని నిపుణలు చెబుతున్నారు. మరోవైపు ఈ హైవేలకు దగ్గరగా స్థానికంగా ఉండే ప్రజలు హైవేపై కొద్దిదూరం ప్రయాణించిన వాళ్లపై కూడా టోల్‌ భారం పడటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు నష్టం కలుగుతుందని ఆరోపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు