Telangana : బండి సంజయ్ ఎన్నికల ప్రచారంపై శశిథరూర్ అభ్యంతరం..

అయోధ్య రామాలయం ఫొటోతో బండి సంజయ్ ప్రచారం చేయడంపై.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తు్న్నారంటూ శశిథరూర్ ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే.. అవి ఫిబ్రవరిలో పంచిన ఫొటోలంటూ బండి సంజయ్ బదులిచ్చారు.

New Update
Telangana : బండి సంజయ్ ఎన్నికల ప్రచారంపై శశిథరూర్ అభ్యంతరం..

Election Campaign : తెలంగాణ(Telangana) లో రోజురోజుకి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా బీజేపీ(BJP) ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay), కాంగ్రెస్(Congress) నేత శశిథరూర్(Shashi Tharoor) మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయోధ్య(Ayodhya) రామాలయం ఫొటోతో బండి సంజయ్ ప్రచారం చేయడంపై.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ శశిథరూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్యాంపెయినర్ పోస్టర్‌పై అయోధ్య రామాలయంతో పాటు.. చిన్న సైజులో ప్రధాని మోదీ, బండి సంజయ్‌ ఫొటోలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అలాగే వీటిని ఇప్పటికే 5 లక్షల ఓటర్లకు పంపిణీ చేశారని అన్నారు.

Also read: వంట ఆలస్యమైందని భార్య హత్య!

'ఎన్నికల నియమావళి ప్రకారం.. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థన స్థలాలను ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించకూడదు. కుల, మత భావాలతో ఓట్లను అడుక్కోకూడదు. ఎన్నికల సంఘం నిద్రపోతుందా అంటూ'.. శశిథరూర్‌ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. అయితే దీనికి బండి సంజయ్ బదులిచ్చారు. ఎన్నికల కోడ్ రాకముందే.. అవి ఫిబ్రవరిలో పంచిన ఫొటోలని వెల్లడించారు.

Also read: కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ.. టెన్షన్ వద్దంటున్న నిపుణులు 

Advertisment
తాజా కథనాలు