Lakshaweep: లక్షద్వీప్‌పై అప్పట్లోనే కన్నేసిన జిన్నా.. పటేల్ ఏం చేశారంటే.. పాకిస్థాన్ నాయకుడు జిన్నా అప్పట్లో లక్షద్వీప్‌పై కన్నేశాడు. కానీ సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ లక్షద్వీప్‌ను భారత్‌లో కలిపేందుకు కృషి చేశారు. ఆ ప్రాంతానికి పాకిస్థాన్ నౌకదళం వెళ్తుందన్న సమాచారం తెలుసుకున్న పటేల్ ముందుగా భారత్ నౌకదళాన్ని పంపించి జాతీయ జెండా ఎగురవేయించారు. By B Aravind 09 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఏ దేశానికైనా తనకు దగ్గర్లో ఉండే సముద్ర పరిమితిపై అధిపత్యం ఉంటుంది. అయితే ఇండియాకు చూసుకుంటే మూడు వైపులా కూడా సముద్రం ఉంది. దీంతో అంతర్జాతీయ వేదికపై భారత్‌కు రాజకీయంగా, భౌగోలికంగా రాణించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. ప్రస్తుతానికి లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు ఇండియాకు వ్యూహాత్మక స్థావరాలుగా ఉన్నాయి. అయితే అప్పట్లో ఈ రెండు దీవులను భారత్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన నాయకుడు ఒకరున్నారు. ఆయనే ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్. ఈ రెండు దీవుల సమూహాలను భారత్‌లో కలిపేందుకు ఆయన ఎంతోకృషి చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చాక.. భారత్, పాకిస్థాన్ విడిపోయాయి. అంతేకాదు భారత్‌లో ఉన్న పలు సంస్థానాలు దేశంలో కలిపే ప్రసక్తే లేదంటూ పట్టుబట్టాయి. కానీ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ రంగలోకి దిగారు. ఒక్కొక్క సంస్థానాన్ని విలీనం చేసే దిశగా అడుగులు వేశారు. అయితే ఈ సమయంలోనే పాకిస్థాన్ నేత జిన్నా లక్షద్వీప్‌కై కన్నేశాడు. వాస్తవానికి పాకిస్థాన్ నుంచి లక్షద్వీప్ చాలా దూరంలో ఉంటుంది. కానీ భారత్‌లోని మలబార్ తీరానికి దగ్గర్లో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని పటేల్.. లక్షద్వీప్ భారత్‌లోనే కలిపేందుకు కృషి చేశారు. Also read: కాళేశ్వరంలో ‘మేఘా’ అవినీతి రూ.50 వేల కోట్లు.. కాగ్ నివేదికలో సంచలన లెక్కలు! మరోవైపు జిన్నా కూడా తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పాకిస్థాన్ నౌకదళం అక్కడికి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. వారి ప్లాన్‌కు పసిగట్టిన పటేల్.. మనదేశ నౌకదళాన్ని లక్షద్వీప్‌కు వెళ్లాలని ఆదేశించారు. వెంటనే భారత నౌకదళ సిబ్బంది అక్కడికి చేరుకొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇక కొద్దిరోజుల తర్వాత లక్షద్వీప్‌కు చేరుకున్న పాకిస్థాన్ నౌకాదళం భారత జాతీయ జెండాను చూసి వెనక్కి వెళ్లిపోయింది. Also read: పెన్షన్ల ఊసే లేదు.. కాంగ్రెస్‌పై కవిత గరం! ఆ తర్వాత లక్షద్వీప్‌ను మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేశారు. 1956లో కొత్తగా ఏర్పాటు చేసిన కేరళలో రాష్ట్రంలో దాన్ని విలీనం చేశారు. అయితే ఆ తర్వాత అదే సంవత్సరం లక్షద్వీప్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. గతంలో లక్షద్వీప్‌కు లక్కదీవ్, మినికోయ్, అమిన్ దీవిగా పిలిచేవారు. 1971లో భారత ప్రభుత్వం లక్షద్వీప్‌గా పేరు మార్చింది. ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించిన తర్వాత మాల్దీవులకు చెందిన ఎంపీలు ప్రధానిపై, భారత్‌పై విమర్శలు చేయడంతో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. #telugu-news #national-news #lakshadweep మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి