Traffic jam:సంక్రాంతి పండగ అంటే అన్ని ఊర్లు, సీటీలు ఒక్క లెక్క హైదరాబాద్ ఒక్కటీ ఒక లెక్క. పండగ నాడు వెలవెలబోయే హైదరాబాద్ మూడు, నాలుగు రోజుల ముందు మాత్రం కళకళలాడిపోతుంది. ఎక్కడ చూసినా జనమే కనిపిస్తారు. రోడ్ల నిండా కార్లు, బస్సులు మాత్రమే కనిపిస్తాయి. మిమాపూర్, కూకట్ పల్లినుంచి ఎల్బీనగర్ వరకు ఎక్కడ చూసినా బస్సులే కనిపిస్తాయి. దానికి కారణమేంటో తెలుసా..
Also read:ఎంకిపెళ్ళి సుబ్బి చావుకు..హనుమాన్ హిట్-ఆదిపురుష్ మీద ట్రోలింగ్
సంక్రాంతి ప్రయాణం...
ఏ పండగకు ఊరెళ్ళినా, వెళ్ళకపోయినా..హైదరాబాద్ వాసులు సంక్రాంతికి మాత్రం ఊర్లకు చెక్కేస్తారు. సెలవులను బట్టి మూడు, నాలుగు రోజుల ముందే ప్రయాణం పెట్టుకుంటారు. ట్రైన్లు, బస్సులు, కార్లు...ఇలా ఎలా వీలయితే అలా వెళ్ళిపోతుంటారు. తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు నుంచే పిల్లలకు హాలిడేస్ ఇచ్చింది. దీంతో ఇన్న రాత్రి నుంచి హైదరాబాద్ వాసులు ప్రయాణాలు మొదలుపెట్టారు. రోడ్ల మీద ఎక్కడ చూసినా బ్యాగులు, సూట్ కేస్‌లు పట్టుకుని జనాలు కనిపిస్తున్నారు. వారిని ఎక్కించుకోవడానికి బస్సులు కూడా బారులు తీరి ఉన్నాయి.
పంతంగి టోల్ గేట్స్...
ఒక హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. హైవే మీద, టోల్ గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరి ఉన్నాయి. ఏపీ వైపు వెళ్లే వాహనాలతో హైవేపై రద్దీ నెలకొంది. చౌటుప్పల్ లోని ఆర్టీసీ బస్టాండ్, కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోతోంది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక పంతంగి దగ్గర టోల్ ప్లాజాను క్రాస్ చేసేందుకు పదినిమిషాలకు పైనే టైమ్ పడుతోంది. ఇక్కడ మొత్తం 18 టోల్ బూత్‌లు ఉండగా ఒక్క విజయవాడ మార్గంలోనే 10 బూత్‌లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ నిదానంగా వెళ్లాలని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.