Sankranti Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవులను పొడిగించింది. సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు ఎక్స్టెండ్ చేసింది. ఈ క్రమంలో ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రుల, ఉపాధ్యాయులు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ALSO READ: Mega DSC: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన
ఇది రెండోసారి..
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గతంలో జనవరి 11వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు ప్రకటించింది. సంక్రాంతి ఏడు రోజుల సెలవులు సరిపోవు అని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఉపాధ్యాయ సంఘాలు ఏపీ విద్యాశాఖను కోరగా.. ఇటీవల సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. 19వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని తెలిపింది. తాజాగా మరో మూడు రోజులపాటు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో రేపటి నుంచి షురూ!..
తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది తెలంగాణ సర్కార్(Telangana Sarkar). జనవరి 12 నుంచి 17 వరకు హాలీ డేస్ ను ప్రకటించింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. జనవరి 12న ఆప్షనల్ హాలిడే, 13వ తేదిన రెండో శనివారం చాలా స్కూళ్లకు ముందుగానే హాలిడే ఉంది. 14న భోగి పండుగ,15న సోమవారం సంక్రాంతి, 16న కనుమ పండుగ కాబట్టి ఈ మూడు రోజులు సెలవు ఉంది. ఇలా వరుసగా 6 రోజుల పాటు పాఠశాల విద్యార్థులకు సెలవులు వచ్చాయి.
ఇంటర్ కాలేజీలు నేటి నుంచే..
తెలంగాణ(Telangana) రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలకు సంక్రాంతి (Sankranti) సెలవులు ముగిశాయి. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంటర్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.
ALSO READ: చంద్రబాబు కేసు విచారణ… చివరిలో ఊహించని ట్విస్ట్!