Sankranthi Holidays : నాలుగు రోజులు ఇంటర్ కాలేజీలు బంద్!

ఇంటర్ బోర్డు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జూనియర్ కాలేజీలు మూతపడనున్నాయి. 17వ తేదీన తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది

New Update
Sankranthi Holidays : నాలుగు రోజులు ఇంటర్ కాలేజీలు బంద్!

TS Sankranti Holidays : తెలంగాణ(Telangana) రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలకు సంక్రాంతి(Sankranti) సెలవులను ప్రకటించిన ఇంటర్ బోర్డు(Inter Board). జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు(Sankranti Holidays) ఉండనున్నాయి. 17వ తేదీన జూనియర్ కళాశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సంక్రాంతి సెలవుల సమయంలో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని కాలేజీలు ఆదేశాలు ఇచ్చింది.

స్కూళ్లకు సెలవులు...

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది తెలంగాణ సర్కార్(Telangana Sarkar). జనవరి 12 నుంచి 17 వరకు హాలీ డేస్ ను ఉండనున్నట్లు తెలిపింది. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. జనవరి 12న ఆప్షనల్ హాలిడే, 13వ తేదిన రెండో శనివారం చాలా స్కూళ్లకు ముందుగానే హాలిడే ఉంది. 14న భోగి పండుగ,15న సోమవారం సంక్రాంతి, 16న కనుమ పండుగ కాబట్టి ఈ మూడు రోజులు సెలవు ఉండనుంది. ఇలా వరుసగా 6 రోజుల పాటు పాఠశాల విద్యార్థులకు సెలవులు ఉండనున్నాయి.

ప్రత్యేక బస్సులు..

సంక్రాంతి పర్వదినం సందర్భంగా నగరాలు, పట్టణాలకు సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న ప్రజలకు TSRTC శుభవార్త చెప్పింది. వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పండుగకు వెళ్లే వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ తెలిపింది. అందులో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ నెల 7 వ తేదీ నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు