Sandeep Vanga: అర్జున్‌ రెడ్డి సినిమా బన్నీతో చేద్దామానుకున్నా..కానీ విజయ్ తో !

అర్జున్ రెడ్డి సినిమా లో హీరోగా ముందు అల్లు అర్జున్‌ ని అనుకున్నాడంట డైరెక్టర్‌ సందీప్‌ వంగా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాని విజయ్‌ దేవరకొండతో చేయాల్సి వచ్చిందని సందీప్‌ చెప్పుకొచ్చాడు. అప్పుడు తీరని ఆ కోరిక ఇప్పుడు నెరవేరతుందని సందీప్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

Sandeep Vanga: అర్జున్‌ రెడ్డి సినిమా బన్నీతో చేద్దామానుకున్నా..కానీ విజయ్ తో !
New Update

Sandeep Vanga: తెలుగు చిత్ర పరిశ్రమకు అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) సినిమా ద్వారా పరిచయమైన సందీప్‌ వంగా (Sandeep Vanga)పెద్ద హిట్‌ నే అందుకున్నాడు. ఆ సినిమాతో యూత్‌ లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. అర్జున్‌ రెడ్డి ముందు వరకు తెలుగులో అలాంటి బోల్డ్‌ సినిమా ఒకటి కూడా లేదనే చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం యానిమల్‌ మూవీతో మరోసారి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ని అందుకున్నాడు సందీప్‌.

యానిమల్‌(Animal) సినిమా సమయంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడ్డాయో...అన్ని అర్జున్‌ రెడ్డి సినిమా విడుదల సమయంలో కూడా వచ్చాయి. కానీ వాటిని అన్నింటిని తట్టుకోని ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సినిమా కోసం నిలబడ్డాడు సందీప్‌. అయితే ఈ సినిమా గురించి సందీప్‌ వంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

ముందుగా అల్లు అర్జున్‌...

అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ దేవరకొండ కంటే ముందు హీరోగా అల్లు అర్జున్‌ (Allu Arjun) ని అనుకున్నానంటూ సందీప్ వంగా చెప్పుకొచ్చాడు. అర్జున్‌ రెడ్డి సినిమా విజయ్‌ కెరీర్‌ ని ఎలాంటి మలుపు తిప్పిందో మనందరికీ తెలిసిందే. అతనని స్టార్‌ హీరోగా ప్రజల ముందు నిలబెట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శర్వానంద్‌ (Sarwanandh) హీరోగా నటించాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల వల్ల తాను సినిమా చేయలేదు. దీంతో ఈ అవకాశం విజయ్‌ చేతుల్లో పడింది. అయితే అర్జున్‌ రెడ్డి కంటే ముందుగా తాను వేరే కథ రాసుకున్నట్లు సందీప్‌ తన తాజా ఇంటర్వ్యూలో వివరించారు. ఆ కథను అల్లు అర్జున్‌ కి వినిపించడం కూడా అయ్యిందంట..కానీ ఆ సినిమా కూడా పలు కారణాలతో ఆ సినిమా కూడా వర్కవుట్‌ కాలేదు.

దాంతో ఆ కథను పక్కన పెట్టేసి అర్జున్‌ రెడ్డి కథను కొన్ని మార్పులు చేసి డెవలప్‌ చేసుకోవడం జరిగిందని తెలిపారు. అయితే కథ డెవలప్‌ అయిన తరువాత కూడా ముందు కథను బన్నీకి వినిపించాలని చాలా ప్రయత్నాలు చేశాను...కానీ నాకు అవకాశం రాలేదని సందీప్‌ తెలిపాడు. ఎంతో మంది నిర్మాతలను సంప్రదించినప్పటికీ కూడా నా కథలో మార్పులు చేర్పులు చెప్పారు.

అప్పుడు దక్కలేదు..కానీ ఇప్పుడు..

దాంతో నేనే నిర్మాతగా మారి విజయ్‌ ని హీరోగా పెట్టి సినిమా ను నిర్మించానని వివరించారు. అనుకున్నట్లుగానే అర్జున్‌ రెడ్డి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. అలా అప్పుడు అల్లు అర్జున్‌ తో మూవీ మిస్ అయినప్పటికీ ఇప్పుడు ఆ అవకాశం దక్కిందని సందీప్‌ తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్, సందీప్ కు ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్లో మూవీ ప్రారంభం కానుంది.

Also read: వేల సంవత్సరాలు గడిచినా చైనా వాల్ ఎందుకు చెక్కు చెదరలేదంటే!

#allu-arjun #arjun-reddy #animal #sandeep-vanga
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe