శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీకోసం కిర్రాక్ డీల్ అందుబాటులో ఉంది. భారీ డిస్కౌంట్ తో మీ సొంతం చేసుకోవచ్చు. ఎలా అని ఆలోచిస్తున్నారా. అయితే మీరు ఈ విషయం గురించి వివరంగా తెలుసుకోవల్సిందే. శాంసంగ్ కంపెనీ వెబ్ సైట్ లో ఈ డీల్ అందుబాటులో ఉంది. దీనిలో భాగంగా మీరు సగం ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కొంతకాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ డీల్ ను సొంతం చేసుకోవచ్చు.
శాంసంగ్ కంపెనీ వెబ్ సైట్లో వీకెండ్ ఆఫర్ ఉంది. అందులో భాగంగా మీరు గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ ఎస్ 23 ప్లస్ ఫోన్ మీరు రూ. 94,999కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు 24నెలలపాటు ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు దాదాపు రూ. 4వేలు ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. 24నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. 256 జీబీ మెమెరీతపాటు 8జీబీ ర్యామ్ కూడా ఉంటుంది. అంతేకాదు ఈ ఫోన్ పై ఏకంగా రూ. 35వేల భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అంటే ఈ ఆఫర్ కూడా కలపుకుంటే మీకు తక్కువ ధరకే ఈ ఫోన్ లభిస్తుంది.
ఇక HDFCబ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఈ ఫోన్ పై రూ. 5వేలు తగ్గింపు ఉంది. అంటే మీకు మరింత డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. అదనంగా రూ. 8వేల తగ్గింపు వర్తిస్తుంది. రెఫరల్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దీనితో రూ. 3500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు శాంసంగ్ స్మార్ట్ వాచ్ కూడా కొంటే అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. కాగా ఈ ఫోన్ ఎంఆర్ పీ రూ. 1,16,999గా ఉంది.
కాగా ఈ ఫోన్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఆక్టాకోర్ ప్రొసెసర్ , 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 12మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా , 6.6 ఇంచుల డిస్ప్లే 4700ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 5జీ స్మార్ట్ ఫోన్. అందుకే ప్రీమియం ఫోన్ కొనాలనే ప్లానింగ్ లో ఉన్నవాళ్లు ఈ ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. కంపెనీ అధికారిక వెబ్ సైట్లో ఈ డీల్ అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి: మీకు ఓటర్ స్లిప్ అందలేదా? డోంట్ వర్రీ డౌన్లోడ్ చేసుకోండిలా…!!