/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-10T171817.247-jpg.webp)
Samantha Ruth Prabhu : విజయ్ దేవరకొండతో నటించిన ఖుషీ(Kushi) సినిమా తర్వాత సమంత కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమంత తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం పై ఎక్కువగా దృష్టి పెట్టారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా కనిపించే సమంత తాజాగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలో నెట్టింట్లో వైరల్ గా మారాయి. బాలీవుడ్ షో MTV Hustle లో సందర్భంగా ఆమె ఫొటో షూట్ లో పాల్గొన్నారు.
View this post on Instagram
స్టైలిష్ డెనిమ్ లుక్స్ లోని సమంత ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, పలువురు సెలెబ్రెటీలు కూడా స్టన్నింగ్, సూపర్, ఓ మై గాడ్ అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే MTV Hustle - ఇండియన్ rap/hip-hop అనే బాలీవుడ్ షోలో గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ షోలో సమంత కంటెస్టెంట్ ను చీరప్ చేస్తూ సందడి చేసిన ప్రోమో నెట్టింట్లో వైరలవుతుంది. ఈ ప్రోమోలో సమంత "hip-hop" ను ప్రమోట్ చేస్తున్న ఏకైక భారతీయ షో ఇది అని మాట్లాడారు. ఈ షోలో జడ్జ్ బాద్షా తో కలిసి సమంత పోటీదారులు ఉత్సాహపరుస్తూ సందడి చేశారు.
View this post on Instagram
View this post on Instagram
Also Read: Salaar vs Dunky: బాలీవుడ్ బాద్ షా కు సలార్ టెన్షన్.. గట్టి దెబ్బే!