Sam Pitroda Comments On Indian Color : భారతీయులు(Indians) ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్(Congress) ఛైర్మన్ శామ్ పిట్రోడా(Sam Pitroda) కొత్త వివాదానికి తెరలేపారు. అమెరికాలో తాను రేకెత్తించిన వారసత్వ పన్ను వ్యాఖ్యల మంటలను ఆర్పే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు “దక్షిణాదిలో ఆఫ్రికన్‌ల వలె కనిపిస్తారు – పశ్చిమాన ఉన్నవారు అరబ్బులు – తూర్పున ఉన్నవారు చైనీస్‌లా కనిపిస్తారు.” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మండిపడ్డ మోదీ..
దీని మీద ప్రధాని మోదీ(PM Modi) సైతం స్పందించారు. దేశాన్ని విభజించి పాలించాలని కాంగ్రెస్ అనుకుంటోంది అని మండిపడ్డారు ప్రధాని మదీ. శరీర రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే దాన్ని తాము సంచమని ఆయన హెచ్చరించారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎటువైపు తీసుకెళ్ళాలని చూస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో చాలా మంది ప్రజలు నల్లగా ఉంటారు. దాని ఆధారంగా ఆ వ్యక్తి యోగ్యతను నిర్ణయిస్తారా? శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపు అని గుర్తించాలని మోదీ అన్నారు. వరంగల్ మామునూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో భాగంగా మోదీ శ్యామ్ పిట్రోడా కలర్ వ్యాఖ్యలపై స్పందించారు.
సోషల్ మీడియాలో మీమ్స్..
దీనికి తోడు ఇప్పుడు శ్యామ్ పిట్రోడా కామెంట్స్ సోషల్ మీడియా(Social Media) లో కూడా తెగ వైరల్ అవుతున్నాయి. దీని సంబంధించి బోలెడు మీమ్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు, మోదీ, జంతువుల ఫోటోలతో...శ్మాయ్ పిట్రోడా ఫోటోను జత చేసి...అతని వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొంతమంది వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కూడా. బారతీయులను అలా ఎలా అవమానిస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మోదీ క్షమాపణ చెప్పాలి.. భారతి స్ట్రాటాజీ అందరినీ గొడ్డలితో చంపడమేనా?