Salaar: నెల రోజులు సినిమాలు రిలీజ్ చేయకండి ప్లీజ్! దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సలార్'. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 22 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. By Bhavana 02 Dec 2023 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే..ఎవరైనా సరే రిలీజ్ ఎప్పుడూ అనే అడుగుతారు. అంతటి క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్. బాహుబలి తరువాత అతని రేంజే మారిపోయింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు కొంచెం నిరాశ పరిచిన ఇప్పుడు తాజాగా మరో పాన్ ఇండియా రేంజ్ మూవీతో ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి త్వరలోనే వచ్చేస్తున్నాడు. ఈ క్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబో లో వచ్చిన సినిమాకి దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎంత ఘనంగా జరిగాయో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగిన సమయంలో ఆ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలైన తరువాత కనీసం మూడు నెలల పాటు ఏ సినిమాని కూడా విడుదల చేయకండి..ఎందుకంటే ఆ రేంజ్ సినిమా రాబోతుందని పేర్కొన్నాడు. ఇప్పుడు అదే మాట సలార్ సినిమాకి కూడా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే సలార్ ట్రైలర్ చూసిన తరువాత ఎవరైనా ఈ మాట కచ్చితంగా అంటారు కూడా. బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ నార్త్ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అయితే ఆ తరువాత ప్రభాస్ కి మంచి హిట్ పడలేదు అనే చెప్పవచ్చు. కానీ ఇప్పుడు రాబోతున్న సలార్ అలా కాదు...ప్రభాస్ కటౌట్ కి సరిపోయేట్లు ప్రశాంత్ నీల్ ఓ సినిమాని తీశాడు అనిపిస్తోంది. ఛత్రపతి రేంజ్ ఇంటర్వేల్ సీన్ లా ఈ సినిమా లో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. యాక్షన్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్..ఇలా ప్రతి విషయంలోనూ ప్రభాస్ ఓ పది సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తుంది. ఛత్రపతి లాంటి సినిమా ప్రభాస్ కి పడితే ఎలా ఉంటుంది అనేది పన్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అందుకే సలార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీలైనంత ఎక్కువ గ్యాప్ ని మైంటైన్ చేస్తే ఇతర సినిమాలు సలార్ దెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. Also read: సోషల్‌మీడియాను ఊపేస్తోన్న ఇటలీ ప్రధాని- మోదీ సెల్ఫీ🥰 .. వైరల్ మీమ్స్.. ‘ఎంత క్యూట్‌గా ఉన్నారో’..! #prabhas #prasanth-neel #pan-india-movie #salaar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి