Sajjala Ramakrishna Reddy: బీసీ సీట్లలో నువ్వు, నీకొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) సూటిగా ప్రశ్నించారు. సీఎం జగన్ (CM Jagan) పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు. 31 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చామని, నాడు-నేడు కింద స్కూళ్ల రూపు రేఖలు మర్చామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలు తమ హక్కుగా వినియోగించుకుంటున్నారని సజ్జల పేర్కొన్నారు.
వైసీపీ (YCP) ప్రభుత్వంలో కోటీ 47 లక్షల కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒక్కటైనా చెప్పగలరా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ''ఉద్ధానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్ధానానికి ఏం చేశాడు. ఉద్ధానం కోసం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏం చేశాడు. చంద్రబాబు ఎవరికి కథలు చెబుతాడు’’ అంటూ సజ్జల మండిపడ్డారు.
ALSO READ: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు
తుఫాన్ల సమయంలో ఫలానా తక్షణ సాయం చేశానని చంద్రబాబు లెక్కలు చెప్పగలరా? అని మండిపడ్డారు. తుఫాన్ విషయంలో 22 లక్షల్లో 10 వేల కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశాడని.. ఈ లేఖ రాయడానికి చంద్రబాబుకి తలకాయ ఉందా?. ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా? అని ఫైర్ అయ్యారు. తుఫాన్ పరిహారం విషయంలో తప్పు పట్టడానికి అవకాశం లేకుండా వైసీపీ సర్కార్ చేసిందని అన్నారు. అసలు చంద్రబాబుకి ఈ రాష్ట్రంతో సంబంధం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్రానికి గెస్ట్ లా వస్తాడని ఎద్దేవా చేశారు.
2019 ఎన్నికల్లో చంద్రబాబును జనం రిజెక్ట్ చేశారని అన్నారు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నాడు కాబట్టే చంద్రబాబును జనం చెత్త బుట్టలో వేశారని చురకలు అంటించారు. హైదరాబాద్‌లో ఉంటే ఆస్తులు కాపాడుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, ఆయన దత్తపుత్రుడు కూడా రాష్ట్రానికి రావడం లేదని ధ్వజమెత్తారు.
ALSO READ: మీ అభిమానాన్ని ఓట్లుగా చేయండి.. పవన్ కీలక వ్యాఖ్యలు!
చంద్రబాబును చూస్తుంటే సినిమాలో క్షుద్రపూజలు గుర్తొస్తున్నాయని సెటైర్లు వేశారు. అభ్యర్థులు మార్పు విషయంలో అవాకులు చవాకులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. బీసీ సీట్లలో నువ్వు, నీకొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారు. చంద్రగిరి వదిలేసి కుప్పంలో ఎందుకు పోటీచేస్తున్నారు? అని ఫైర్ అయ్యారు. 2024లో చంద్రబాబుకు కుప్పంతో సహా ఒక్క టిక్కెట్ కూడా రాదని జోస్యం చెప్పారు. అత్యంత పారదర్శకంగా జరుగుతున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.