హీరోలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ఏపీలో నకిలీ ఓట్ల వివాదాలపై విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీఈసీ బృందానికి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సాక్ష్యాలతో సహా దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఎన్నికల్లో వినియోగించకుండా చూడాలని కోరినట్లు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణ. బీసీ సీట్లల్లో నువ్వు, నీ కొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో ఏపీలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు.
రాష్ట్ర, దేశ ప్రజలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) శుభాకాంక్షలు వెల్లడించారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu). ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్య భారతమన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు, అద్భుతమైన దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నానని తెలిపారు. అలాగే 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ ఘనంగా నిర్వహించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించగా.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగరవేశారు.జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పార్టీ ప్రముఖ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ నేతలు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.