Sai Pallavi: నాన్న చెప్పిన నీతి మరిచిపోను.. గౌరవంగానే తప్పుకుంటా నటి సాయి పల్లవి తన పేరెంట్స్ చెప్పిన నీతి ఎప్పటికీ మరిచిపోనంటోంది. మన జీవితం ఎప్పుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడమే మన పని. మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, గౌరవంగానే బతకాలి. గౌరవంగానే వెళ్లిపోవాలని నాన్న చెప్పారు. ఆ దిశగానే తన ప్రయాణం కొనసాగుతుందని చెప్పింది. By srinivas 14 Dec 2023 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Sai Pallavi: బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకుంది. తొమ్మిదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. వచ్చిన ప్రతి సినిమా అవకాశాన్ని గుడ్డిగా ఒప్పుకోకుండా ప్రతి కథకు ఓ పరమార్థం ఉండేలా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో అందరికంటే భిన్నమైన నటిగా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి ఇన్నాళ్ల కెరీర్ లో ఎప్పుడూ పెద్దగా ఖాళీలేదు. విభిన్న కథల్లో తనదైన ముద్ర వేస్తూ వరుస సినిమాలు దూసుకెళ్తున్న ఆమె ఇటీవల లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్యూటీ తన కెరీర్ అండ్ పర్సనల్ విషయాలతోపాటు తల్లిదండ్రులు తనకు నేర్పిన బుద్దుల గురించి మాట్లాడింది. ఈ మేరకు సాయిపల్లవి మాట్లాడుతూ.. ‘మా పేరెంట్స్ నేను డాక్టర్ అవుతాననుకున్నారు. అదే లక్ష్యంతో ఎంబీబీఎస్ చదివించారు. నేను ఇష్టంతోనే చదివాను. అయితే నటిన జీవితంలోకి కూడా ఇష్టంతోనే వచ్చాను. చిన్నప్పటి నుంచి డాన్స్ కూడా నేర్చుకున్నాను. నా జీవితంలో ఏదీ ఇష్టంలేకుండా జరగలేదు. ఇక నాకున్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి చెప్పాలంటే అది దేవుడిచ్చిన వరం. నిజానికి ‘ప్రేమమ్’ (Premam) సినిమా వరకూ నేను నటించగలనని నాకే నమ్మకం లేదు. నా నటన చూసి ఇంట్లోవాళ్లు కూడా షాక్ అయ్యారు. అలాగే ‘ప్రేమమ్’ సినిమాకు సైన్ చేస్తున్నప్పుడు నాన్న నాకు చెప్పిన నీతి, ఆ మాటలు జీవితంలో మరిచిపోను. 'మన జీవితం ఎప్పుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడమే మన పని. మనం ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. గౌరవంగా ఉండాలి. గౌరవంగానే బతకాలి.. గౌరవంగానే వెళ్లిపోవాలి' 'అని నాన్న నాకు చెప్పారు. ఇప్పటికీ చెబుతుంటారు. నేను అదే దిశగా నా ప్రయాణం కొనసాగిస్తున్నా' అంటూ పలు విషయాలు చెప్పుకొచ్చింది. Also read : పత్తి కూలీలపై పులుల దాడి.. ఆ జిల్లాను వణికిస్తున్న కృర మృగాలు ఇక సాయి పల్లవి (Sai Pallavi) సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ రాముడి పాత్రలో తెరకెక్కించబోతున్న 'రామాయణం'లో (Ramayana) సాయిపల్లవి సీతగా నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ‘యష్19’ లోనూ (Yash 19) హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తుండగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. #family #personal-life #reveals #sai-pallavi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి