స్టార్ నటి సాయి పల్లవికి సంబంధించి మరో బిగ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు రణ్‌బీర్ కపూర్, నితీష్ తివారి కాంబోలో రాబోతున్న ‘రామాయణం’ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సాయి పల్లవి రీసెంట్గా ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైలర్ అవుతుండగా ఆమె ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఎట్టకేలకు తమ అభిమాన హీరోయిన్ను సీత పాత్రలో చూడబోతున్నందుకు హ్యాపీగా ఉందంటున్నారు.
Also read :హోటల్లో రెచ్చిపోయిన కామాంధులు.. ఒకేసారి ఐదుగురు కలిసి
ఈ మేరకు ఇప్పటికే ‘రామాయణం’ సినిమా ప్రారంభం అయినట్లు ప్రచారం జోరందుకుంది. అయితే ఈ క్రమంలోనే సాయి పల్లవి ముంబయిలో ఉన్నారంటూ కొన్ని ఫొటోలను అభిమానులు షేర్ చేశారు. అందుకే ఆమె ముంబయి వెళ్లారంటూ అభిమానులు కామెంట్స్పెడుతున్నారు. ఇక మరోవైపు ఈ చిత్రం కోసం అభిమానులు క్రియేట్ చేసిన ఏఐ ఇమేజ్‌లు కూడా వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు ఈ సినిమాలోని తారాగణం గురించి చిత్రబృందం నుంచి అధికారికంగా సమాచారం లేకపోయినప్పటికీ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవిలే సీతగా ఫిక్స్ అయినట్లు ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను రెండు భాగాలుగా
తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుండగా దీని రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు మొదటి భాగం షూటింగ్ నిర్వహించనున్నారట. దీని కోసం శ్రీలంకలో భారీ సెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్, మధు మంతెన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ గురించి గతంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. ఇది చాలా పెద్ద ప్రయత్నమని.. పూర్తవ్వడానికి చాలా సంవత్సరాలు పడుతుందని స్పష్టం చేశారు. ఇంకా ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.