India Coach: భారత హెడ్ కోచ్ పదవికి సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోదీ, ధోనీ పేర్లు!

భారత క్రికెట్ జట్టు కోచ్ కోసం ఈ నెల 27 న ఆఖరు తేదీ కావటంతో 3000కు పైగా దరఖాస్తులను BCCI కు అందాయి. అయితే ఈ దరఖాస్తు చేసుకున్న వారిలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ , నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి నకిలీ దరఖాస్తులు కూడా వచ్చాయి.దీనిపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది.

India Coach: భారత హెడ్ కోచ్ పదవికి సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోదీ, ధోనీ పేర్లు!
New Update

India Coach Applications From Sachin, Modi, Dhoni: భారత క్రికెట్ జట్టు కోచ్ కోసం ఈ నెల 27 న ఆఖరు తేదీగా  బీసీసీఐ ప్రకటించింది.అయితే ఇప్పటి వరకు 3000కు పైగా దరఖాస్తులు BCCI కు అందాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), ఎంఎస్ ధోనీ (MS Dhoni) , నరేంద్ర మోదీ (PM Modi), అమిత్ షా వంటి నకిలీ దరఖాస్తులు కూడా వచ్చాయి.దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం భారత జట్టు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ తర్వాత ముగియనుంది. అయితే ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్ కోసం BCCI అన్వేషన ప్రారంభించింది. ఇందులోభాగంగా ఈ నెల 27లోపు కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దీని కోసం, బోర్డు తన వెబ్‌సైట్‌లో గూగుల్ ఫారమ్‌కు ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

మే 27 వరకు, భారత కోచ్ కావడానికి 3000 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో చాలా దరఖాస్తులు పేరుకు మాత్రమే ఉన్నాయి. సచిన్ టెండూల్కర్, నరేంద్ర మోదీ వంటి వ్యక్తుల పేర్లను ఉపయోగించి చేసిన దరఖాస్తులను ఈ కేటగిరీలో లెక్కిస్తున్నారు.

Also Read: అంబటి రాయుడు నువ్వొక రియల్ జోకర్..కెవిన్ పీటర్సన్

ఈ దరఖాస్తులకు సంబంధించి 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ప్రశ్నకు బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, 'గతసారి కూడా బీసీసీఐకి ఇలాంటి దరఖాస్తులు వచ్చాయి. గూగుల్ ఫారమ్ ద్వారా బోర్డు దరఖాస్తులను ఆహ్వానించడం కూడా దీనికి కారణం. గూగుల్ ఫారమ్ ద్వారా వచ్చిన దరఖాస్తులను సులభంగా చేయవచ్చని అన్నారు. అయితే కొందరు అనవసరంగా ఫేక్  పేర్లతో దరఖాస్తులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.

అయితే, ఏ ఆటగాళ్లు కోచ్‌లుగా మారేందుకు తీవ్రంగా దరఖాస్తు చేసుకున్నారనే విషయాన్ని బోర్డు అధికారి వెల్లడించలేదు. ఈ రేసులో గౌతమ్ గంభీర్ పేరు ముందంజలో ఉన్నట్లు నిపుణులు  భావిస్తున్నారు. అయితే దీనిపై గంభీర్ ఏ విధంగా స్పందించలేదు.
#india-coach #ms-dhoni #ipl-2024 #sachin-tendulkar #bcci #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe