Plane Crash in Russia : రష్యా(Russia) లో ఘోర విమాన ప్రమాదం(Plane Crash) జరిగింది. మంగళవారం సైనిక కార్గో విమానం(Cargo Flight) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 15 మంది ఉన్నారు. ఈ సంఘటన గురించి సమాచారం ఇస్తూ, రష్యా తన ఇల్యుషిన్ IL-76 మిలిటరీ కార్గో విమానం ఒకటి మంగళవారం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయిందని తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 15 మంది ఉన్నట్లు వెల్లడించింది. రష్యన్ సోషల్ మీడియా నెట్‌వర్క్(Social Media Network) లలో ధృవీకరించని వీడియోలో మండుతున్న ఇంజిన్‌తో విమానం కూలిపోతున్నట్లు కనిపిస్తోంది. హెలికాప్టర్ చక్కర్లు కొడుతుండగా ఆకాశంలో పెద్ద ఎత్తున పొగలు కక్కుతూ కనిపించాయి.ఇల్యుషిన్ -76 విమానం మాస్కోకు తూర్పున 200 కిలోమీటర్ల (125 మైళ్లు) దూరంలో ఉన్న ఇవానోవో ప్రాంతంలో కూలిపోయిందని, దాని ఇంజిన్‌లో ఒకదానికి మంటలు అంటుకున్నాయని మాస్కో తెలిపింది.
అయితే విమానంలో ఉన్న వారు సజీవంగా ఉన్నారా లేక చనిపోయారా అనే విషయంపై స్పష్టత లేదు. విమానం కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని వారాల క్రితమే ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలను తీసుకెళ్తున్న విమానం కూలిపోయి, భారీగా ప్రాణ నష్టం జరిగింది.
ఇది కూడా చదవండి : ఇళ్లపై కూలిన తేజాస్ ఫైటర్ జెట్.. వీడియో వైరల్!