Moscow Attack: రష్యాలో ఉగ్రదాడి ఘటన.. స్పందించిన పుతిన్ రష్యా జరిగిన భీకర ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ స్పందించారు. ఘటనను అనాగరికి ఉగ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు. అలాగే ఈ మరణకాండకి కారకులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. By B Aravind 23 Mar 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి రష్యా రాజధాని మాస్కోలో అతిపెద్ద సంగీత కచేరీలో హాలులో శుక్రవారం భీకర ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై తాజాగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ స్పందించారు. ఈ ఘటనను అనాగరికి ఉగ్రవాద చర్య అని అన్నారు. అలాగే ఈ మరణకాండకి కారకులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. Also Read: కేజ్రీవాల్‌కు షాక్.. అత్యవసర విచారణకు ‘నో ‘ చెప్పిన కోర్టు అలాగే ఈ దాడికి పాల్పడ్డ ముష్కరులకు ఉక్రెయిన్‌తో సంబంధాలున్నాయని తమకు సమాచారం అందినట్లు పుతిన్ తెలిపారు. అయితే ఉగ్రవాదులు రష్యా సరిహద్దులు దాటి ఉక్రెయిన్‌కు వెళ్లేందుకు కొందరు సహకరించారని రష్యా మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వీటిని ఉక్రెయిన్ ఖండించింది. ఈ దాడితో తమకు సంబంధం లేదని చెప్పింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఈ ఉగ్రదాడితో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా తెలిపింది. అయితే ఈ దాడి చేసింది మేమేనని ఇప్పటికే ఐఎస్‌ఐఎస్ ప్రకటన చేసింది. ఇదిలాఉండగా ఈ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 150కి చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి దాదాపు 6వేల మందికి పైగా సామర్థ్యమున్న క్రాకస్ సిటీ హాలులో ప్రముఖ బ్యాండ్ అయిన 'పిక్‌నిక్' సంగీత కార్యక్రమం జరుగుతుండగా.. ఒక్కసారిగా సాయుధులు ఎంట్రీ ఇచ్చి కాల్పులు జరిపారు. ముందుగా బాంబుపేలుళ్లు.. ఆ తర్వాత తూటాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో.. చాలామంది ప్రాణాలు కోల్పోయారని రష్యా మీడియా వెల్లడించింది. Also Read: క్లాస్‌రూమ్‌లో ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ చేసిన టీచర్.. నెటిజన్లు షాక్! #telugu-news #vladimir-putin #moscow-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి