Russia: ఉక్రెయిన్‌పై రాకెట్ల దాడులతో విరుచుకుపడ్డ రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా.. రాకెట్లతో దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఒక రాకెట్ రూల్స్‌కు విరుద్ధంగా తమ ఎయిర్‌స్పేస్‌లోకి వచ్చిందని పోలండ్ మండిపడింది. కీవ్‌పై రష్యా రాకెట్లతో దాడులు చేయడం నాలుగు రోజుల్లోనే ఇది మూడోసారి కావడం గమనార్హం. By B Aravind 24 Mar 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి గత రెండేళ్ల క్రితం రష్యా-ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ఎక్కడో ఓ చోట బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా.. రాకెట్లతో దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఒక రాకెట్ రూల్స్‌కు విరుద్ధంగా తమ ఎయిర్‌స్పేస్‌లోకి వచ్చిందని పోలండ్ మండిపడింది. అయితే కీవ్‌పై రష్యా రాకెట్లతో దాడులు చేయడం నాలుగు రోజుల్లోనే ఇది మూడోసారి కావడం గమనార్హం. Also Read: బలవంతంగా ముస్లిం కుటుంబంపై రంగులు.. వీడియో వైరల్ దీనిపై సంబంధించి ఉక్రెయిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ' ఆదివారం రష్యా.. కీవ్‌పై రాకెట్లతో దాడి చేసింది. టీయూ-95ఎమ్‌ఎస్ క్రూయిజ్ మిసైల్స్‌ను ప్రయోగించింది. ఉక్రెయిన్ ఉపరితల భద్రతా వ్యవస్థ సైరన్ దాదాపు రెండు గంటల పాటు మోగుతూనే ఉంది. వీటిలో 18 మిసైల్స్, 25 డ్రోన్లలను ఉక్రెయిన్ సైన్యం కూల్చివేసినట్లు'.. కీవ్ సైనికాధికారి సెర్హి పాప్‌కో పేర్కొన్నారు. ఈ దాడిలో ఒక రాకెట్ తమ ఎయిర్‌స్పేస్‌లోకి వచ్చిందని పోలండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా అంతర్జాతీయ నిబంధనలను తరచుగా ఉల్లంఘిస్తోందని మండిపడింది. ఇదిలాఉండగా.. తాజాగా రష్యా రాజధాని మాస్కోలోని ఓ సంగీత కచేరీలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి పాల్పడ్డ ముష్కరులకు ఉక్రెయిన్‌తో సంబంధాలున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. ఈ దాడితో మాకు ఎలాంటి సంబంధమని లేదని.. రష్యా చేసిన ఆరోపణలను ఉక్రెయిన్ ఖండించింది. మరోవైపు ఈ దాడి మేమే చేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ తెలిపింది. Also Read: సైనికులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్న రాజ్‌నాథ్ సింగ్.. #telugu-news #russia-ukraine-war #moscow-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి