Moscow Attack : 150కి చేరిన మృతుల సంఖ్య.. పోలీసుల అదుపులో ఐసిస్ ఉగ్రవాదులు?

రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 150కి చేరుకుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 11 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ఆరోపిస్తోంది.

New Update
Moscow Attack : 150కి చేరిన మృతుల సంఖ్య.. పోలీసుల అదుపులో ఐసిస్ ఉగ్రవాదులు?

Masco : రష్యా(Russia) రాజధాని మాస్కో(Moscow) లో ఉగ్రదాడి జరగిన సంగతి తెలిసిందే. క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లోకి చొరబడ్డ ముష్కరులు.. కాల్పులకు తెగడ్డారు. అయితే ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 150కి చేరుకుందని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం 11 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో నలుగురు ఉగ్రవాదులు(Terrorists) ఉన్నారని పేర్కొన్నారు. అయితే రష్యా భద్రత సంస్థ శనివారం ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌కు ఈ ఘటనపై సమాచారం అందించినట్లు సమాచారం.

Also Read : కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి..

ఇక వివరాల్లోకి వెళ్తే.. మాస్కోలని క్రాస్నోగోర్స్క్‌ లో ఉన్న క్రాకస్‌ సిటీ హాల్‌లో షాపింగ్ మాల్, సంగీత కచేరీ వేదికలున్నాయి. అలాగే రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ అయిన పిక్నిక్‌ ప్రదర్శనను చూసేందుకు శుక్రవారం చాలామంది అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పుల మోత మోగించారు. బాంబులు కూడా విసిరారు. బుల్లెట్ల నుంచి తప్పించుకునేందుకు చాలామంది సీట్ల వెనుక దాక్కున్నారు. మరికొందరు పరుగులు ఎంట్రన్స్‌ గేట్‌ వైపు పరిగెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

అయితే ఈ దాడిపై రష్యా భద్రత సంస్థ(FSB) సంచలన ఆరోపణలు చేసింది. కాల్పులు జరిపిన ముష్కరులకు ఉక్రెయిన్‌తో పరిచయాలు ఉన్నాయని.. దాడుల తర్వాత ఉక్రెయిన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపింది. మరోవైపు ఈ దాడిలో తమకు సంబంధం లేదని ఉక్రెయిన్ దీన్ని ఖండించింది. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఈ దాడితో సంబంధం ఉన్నట్లు ఆధారాలేమి లేవని అమెరికా పేర్కొంది. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. మరోవిషయం ఏంటంటే గతంలోనే అమెరికా.. ఈ ఘటనకు సంబంధించి రష్యాను హెచ్చరించింది. గత 20 ఏళ్లలో రష్యాపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి(Terrorist Attack) ఇదే కావడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read : దక్షిణాదికి నీటి కొరత ముప్పు.. రిజర్వాయర్లలో తగ్గిపోతున్న నీటి మట్టాలు 

Advertisment
తాజా కథనాలు