Runa Mafi: తెలంగాణలో రేపటినుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు లక్ష రూపాయల లోపు రుణమాఫీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు రైతు ఖాతాల్లో జమ చేయనుంది. 11లక్షల 50 వేల మంది రైతులకు రేపు ఒకేసారి రుణమాఫీ కానుంది. తొలి రోజు రూ.6 వేల 800 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది రేవంత్ సర్కార్. రెండో దఫా ఆగస్ట్ 15 లోపు మరో లక్ష బ్యాంకుల్లో జమ చేసేందుకు సిద్ధమైంది.
రేషన్ కార్డులు లేని 6 లక్షల 36 మందికి ఈ రుణమాఫీ వర్తించనుంది. రేషన కార్డు లేకపోయిన రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. రేషన్ కార్డు లేని రైతుల ఇళ్లకు వ్యవసాయ అధికారులు వెళ్లి...అర్హుల ఎంపిక చేపడతారని మంత్రి తుమ్మల (Tummala Nageswara Rao) అన్నారు. లక్ష జీతం ఉన్నవాళ్లుకు రుణమాఫీ లేదని చెప్పారు. లక్షకు పైగా జీతం ఉన్నవారి ఖాతాలు 17 వేలు ఉన్నట్లు తెలిపారు. రుణమాఫీలో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ.31 వేల కోట్ల నగదు జమ చేయనున్నట్లు చెప్పారు.