రెండు స్థానాల్లో ఒమర్ అబ్ధుల్లా ముందంజ
జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలలో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్ధుల్లా రెండు స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. గండెర్బల్, బుద్గాం రెండు స్థానాల నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ చేశారు.
జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలలో నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్ధుల్లా రెండు స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. గండెర్బల్, బుద్గాం రెండు స్థానాల నుంచి ఒమర్ అబ్దుల్లా పోటీ చేశారు.
JK, హర్యానాలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఈ 2 రాష్ట్రాల్లో మేజిక్ ఫిగర్ 46 కాగా.. జమ్ములో కాంగ్రెస్ కూటమి 55 స్థానాల్లో.. హర్యానాలో 45 సీట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. జమ్ములో బీజేపీ కేవలం 27 స్థానాల్లోనే ఆధిక్యం ఉంది.
J&K ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దేశ రాజకీయాలను హీటెక్కిస్తోంది. 11 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్- 36, బీజేపీ- 22, కాంగ్రెస్-7, పీడీపీ -3 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి.
హర్యానాలో JJP చేతులెత్తేసింది. గత ఎన్నికల్లో 10 సీట్లతో బీజేపీతో కలిసి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈసారి ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలో ఉంది. పార్టీ చీఫ్ దుష్యంత్ చౌతాలా వెనుకంజలో ఉన్నారు.
హర్యానాలో కాంగ్రెస్ 55 స్థానాల్లో, బీజేపీ-23 స్థానాల్లో దూసుకుపోతున్నాయి. JKలో 25 స్థానాల్లో బీజేపీ, 38 స్థానాల్లో కాంగ్రెస్, NC ముందంజలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో పండగ వాతావరణం కనిపిస్తోంది. హర్యానా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతున్న క్రమంలో సంబరాలను ప్రారంభించారు కాంగ్రెస్ శ్రేణులు. ఢిల్లీ పార్టీ ఆఫీస్ ఎదుట సీట్లు తినిపించుకున్నారు.
హర్యానాలోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినేశ్ ఫోగట్ ముందంజలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఆమెకు మెజారిటీ ఓట్లు దక్కినట్లు తెలుస్తోంది.
హర్యానా, J&Kలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. హర్యానాలో కాంగ్రెస్-35, బీజేపీ-12, ఇతరులు -4.. J&Kలో బీజేపీ-15, కాంగ్రెస్-8, పీడీపీ -1 స్థానల్లో ఆధిక్యంలో ఉన్నాయి.